Samantha : సమంత పరిచయం అక్కర్లేని హీరోయిన్ అక్కినేని ఇంటి కోడలిగా ఒక వెలుగు వెలిగి ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడి తనేంటో నిరూపించుకున్నారు సమంత. వయసు పైబడుతున్న అందం ఈమె సొంతం. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు సమంత ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలు వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతున్న సమంత తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తున్నారు సమంత. రీసెంట్ గా తెలుగులో ఖుషి సినిమాతో హిట్టుకొట్టారు సమంత.ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చారు.
అందుకు కారణం ఆమె అనారోగ్యం. కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే మయోసైటిస్ తో బాధపడుతున్నారు సమంత. ఈ సమస్య నుండి కోలుకొని సినిమాలోకి రియంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ తో మళ్ళీ బిజీ అవ్వనున్నారు సమంత రీ ఎంట్రీ కోసం డైరెక్టర్స్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. భారీగా రెమ్యూనేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారుట, సమంత రియంట్రీ ఏ విధంగా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం సమంత వీడియో ఒకటి నెట్టింటి వైరల్ అవుతుంది ఆ వీడియోలో నేను మీ సమంత అభివృద్ధికి ఓటు వేయండి సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ (vote for TDP) సమంత వీడియోలో చెప్పుకొచ్చారు ఈ వీడియో నిజమో కాదో సమంత స్పందిస్తే కానీ తెలియదు కానీ టిడిపి లీడర్స్ చాలామంది అభిమానులు ఈ వీడియోని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఈ వీడియో నిజం కాదని, మార్ఫింగ్ వీడియో అని కూడా అంటున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ఇలా డైరెక్ట్ గా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం ఇదే తొలిసారి కావచ్చు, అందుకే ఈ వీడియో నిజమో కాదో తెలుసుకోవడానికి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా సమంత త్వరగా సినిమాల్లోకి రావాలని రీయంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.