Venkatesh: షూటింగ్ స్పాట్ లో వెంకటేష్ ని చితకబాదిన స్టార్ డైరెక్టర్..కారణం అదేనా!

Posted by venditeravaartha, September 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తన కెరీర్లో తీసిన సినిమాల్లో దాదాపు 70శాతం వరకు విజయాలతో విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు వెంకటేష్. ఆయన సినిమా అంటే చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ల దాకా అందరూ ఇష్టపడుతారు. ఎందుకంటే వెంకటేష్ సినిమాల్లో యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్స్, ఎమోషన్స్, కామెడీ ఇలా అందరికీ కావాల్సిన ఎమోషన్స్ ఉంటాయి. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల సత్తా ఉన్న హీరో వెంకటేష్. ఇక ఆయన నటించిన చంటి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే.

అప్పట్లో ఆయనకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఆయన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తరహాలో సైంధవ్ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అంత పెద్ద స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ ని ఓ డైరెక్టర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ చూస్తుండగా చెంప చెల్లుమనిపించారట. ఏంటి వార్త చదివి షాక్ అవుతున్నారా.. మరి వెంకటేష్ ని కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు. అసలు చెంపపై కొట్టేంత పెద్ద తప్పు వెంకటేష్ ఏం చేశారని ఆలోచిస్తున్నారా.. దాని గురించి తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ హీరోగా.. దివ్యభారతి హీరోయిన్ గా వచ్చిన బొబ్బిలి రాజా సినిమా దాదారు అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా 1990లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాక బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా ఫస్టాఫ్ పూర్తిగా అడవిలోనే నడుస్తోంది. తర్వాత కూడా సినిమాలో చాలా భాగం అడవిలోనే షూటింగ్ తీశారు డైరెక్టర్ బి గోపాల్. చిత్ర బృందం అంతా క్రూర మృగాల మధ్య అన్ని రోజులు షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే షూటింగ్ టైంలో వెంకటేష్ జీవితంలో ఒక చెడు సంఘటన జరిగిందట. ఓ రోజు హీరో వెంకటేష్ షూటింగ్ అయిపోగానే చెట్టు కింద కాస్త అలసటగా కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకుని కాస్త కునుకు తీశారట.

ఆ సమయంలో వెంకటేష్ మొఖంపై ఒక విషపు పురుగు పై నుంచి పడిందట. వెంటనే ఆ పురుగును చూసిన దర్శకుడు గోపాల్.. అందరూ చూస్తుండగానే పరిగెత్తుకెళ్లి వెంకటేష్ చెంపపై గట్టిగా కొట్టారట. చాలా సేపటి వరకు వెంకటేష్ ని అలా ఎందుకు కొట్టారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత డైరెక్టర్ గోపాల్ అసలు విషయం అందరికీ చెప్పారట. విషపు పురుగు వెంకటేష్ ముఖం పై పడింది.. అది కుడితే ఆయన బాడీకి విషం ఎక్కుతుంది అందుకే కొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారట. ఆరోజు ఆయన అలా కొట్టకపోయి ఉంటే వెంకటేష్ కు ప్రమాదం జరిగి ఉండేదని అందరూ అనుకున్నారట. ఏది ఏమైనా వెంకటేష్ పెద్దగండం నుంచి గోపాల్ బయటపడేశారని తెగ మెచ్చుకున్నారట అందరూ.

222 views