పెద్దాపురం టీడీపీ లో స్తబ్దత…..అయోమయంలో తమ్ముళ్లు

Posted by venditeravaartha, February 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల హడావుడి కన్పిస్తుంటే కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు నిస్తేజంలో ఉన్నారు..కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ కి బలమైన క్యాడర్,కష్టపడి పనిచేసే అభిమానులు ఎక్కువగానే ఉంటారు…2014 ఇదే స్థానం నుండి నిమ్మకాయల చినరాజప్ప గెలుపొందారు..తర్వాత ఉప ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది.పార్టీ విధేయుణ్ణి అని చెప్పుకుంటూ పార్టీ ఆవిర్భావం నుండి జెండా ను మోస్తున్న వారిని కాకుండా తనకంటూ సొంత వర్గాన్ని రాజప్ప తయారుచేసుకోవడం..క్రమక్రమంగా వారి ఆగడాలు పెరగడంతో సీనియర్లు పార్టీకి దూరం అయ్యారు.

1988 లో దళితులకు ఎన్టీఆర్ ప్రభుత్వం కేటాయించిన భూములకు మరియు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి గ్రావేల్ తవ్వకాలకు ఆజ్యం పోసి రాజప్ప దళితుల పొట్ట కొట్టాడు అనేది జగమెరిగిన సత్యం..విపత్తుల నిర్వహణ శాఖా మంత్రిగా పనిచేసిన రాజప్ప గ్రావెల్ తవ్వకాలతో ఆ పర్యావరణ పరిరక్షణ కు తూట్లు పొడిచారు.2019 రాష్ట్రమంతా వైసీపీ గాలి ఉన్నప్పటికీ నియోజకవర్గంలో వైసీపీలో లుకలుకలు రాజప్పకు కలిసివచ్చి మరోసారి ఎమ్మెల్యే గా గెలిచారు.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజప్ప ప్రాబల్యం తగ్గిపోయింది.. నియోజకవర్గంలో క్యాడర్ సమస్యలను గాలికి వదిలేయడంతో చాలా మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. వాళ్ళను ఆపే ప్రయత్నం రాజప్ప చేయలేదు..ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ బహిష్కరించింది అనే వంకతో గెలిచే స్థానాలు విషయంలో కూడా రాజప్ప పట్టించుకోలేదు..రెండు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక నియోజక వర్గంగా పేరొందిన పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ రెండు మున్సిపాలిటీ లను వైసీపీ కైవసం చేసుకోవడం రాజప్ప అసమర్థత కు నిదర్శనం అని,ఎన్నికల సమయంలో ఫోన్ లు స్విచ్చాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయాడని లోపాయకారిగా వైసీపీ కి మద్దతు ఇచ్చాడని నియోజకవర్గంలో బహిరంగ రహస్యం..

ఆకుల సత్యనారాయణ అనే వ్యాపారవేత్త తో కలిసి ఆర్ధిక లావాదేవీలు రాజప్ప కుమారుడు రంగ్ నాగ్ ఇప్పటికి కొనసాగిస్తున్నాడు అని అందరి నోటా వినిపిస్తున్నాయి దాని ప్రతిఫలమే అచ్చంపేట లో స్వగృహం బహుమతి అంటారు.రాజప్ప అల్లుడు సైతం రాజప్ప అండదండలతో అధికారం దుర్వినియోగం చేసాడని అంటుంటారు.2019 ఎన్నికలు ముగిశాక మూడు సంవత్సరాల పాటు ఎవరికి అందుబాటులో లేడని ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి టిక్కెట్ ఎక్కడ గల్లంతు అవుతుంది అని నియోజకవర్గంలో హడావుడి చేసి బాబు గారి పెద్దాపురం పర్యటన లో టికెట్ ప్రకటించకున్నాడని అంటుంటారు..ఇటీవల చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలలో పాల్గొనకుండా రాజమండ్రి మకాం వేసాడని,కుమారుడిని నియోజకవర్గంలో తిప్పినా అంతంతమాత్రమే అని ,బాబు గారి అరెస్టు సమయంలో జనాల్లోకి తీసుకువెళ్లడం లో రాజప్ప విఫలం అయ్యాడని ముఖ్య నాయకులే పెదవి విరుస్తున్నారు.రాజమండ్రి లో జరిగిన మహానాడు విజయవంతం చేయడంలో చేతులు ఎత్తేసాడు అని పార్టీలో కార్యకర్తలే వాపోతున్నారు

అయితే గత కొన్ని రోజులుగా నియోజకవర్గ టీడీపీ లో స్తబ్దత నెలకొని ఉంది.. రాజప్ప వయస్సు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు అని అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం పార్టీకి నష్టమే అని అని అంటున్నారు,ఇటీవల బాబు పొలిట్ బ్యూరో సమావేశంలో ఇదే అంశం చంద్రబాబు రాజప్ప దగ్గర ప్రస్తావించారు అంటున్నారు…మిత్రపక్షం జనసేన నాయకులతో కూడా సత్సంబంధాలు లేవని,టీడీపీ కి టికెట్ కేటాయిస్తే వారు ఎంత వరకు మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితి..జనసేన క్యాడర్ రాజప్పకు టిక్కెట్ ఇస్తే కలిసి పనిచేయలేము అని బహిరంగంగానే చెపుతున్నారు.రాజప్ప వారితో కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు…అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ లోకి క్యూ కడుతుండే పెద్దాపురం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి ఒక్కరూ కూడా చేరింది లేదని రాజప్ప ఆ ప్రయత్నాలు చేసినా దాఖలాలు కూడా లేవని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన బలమైన వర్గం ఉన్న తోట సుబ్బారావు నాయుడు ని ఎన్నికలు ముగియగానే రాజప్ప పక్కన పెట్టేసాడు.. ఈ ఎన్నికల్లో నాయుడు రాజప్ప కు దూరంగానే ఉంటూ వస్తున్నాడు.
ప్రత్యర్ధి వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ లో వారిని ఎదుర్కొనే సత్తా లేకుండా పోతుందని నియోజకవర్గ టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..పెద్దాపురం నియోజకవర్గంలో ఏ అభ్యర్థి వరుసగా మూడు సార్లు గెలిచినా చరిత్ర లేదని

ఈ అంశాలను టీడీపీ పరిగణనలోకి తీసుకుని
సీనియర్ గా రాజప్ప కు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించి అభ్యర్థి ని మార్చాలని టీడీపీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నారు.లేకపోతే నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటుంది అని అంటున్నారు.అభ్యర్థి ని మారిస్తే పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న కార్యకర్తలు, వైసీపీ లో అసంతృప్తి గా ఉన్న నాయకులు,జనసేన నాయకులు గెలుపుకోసం పనిచేస్తారని అంటున్నారు..టీడీపీ అధిష్టానం పెద్దాపురం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Tags :
611 views