Srivishnu: స్టార్ హీరోలకు పోటీనిస్తున్న శ్రీవిష్ణు.. వారం రోజుల్లో రెట్టింపు షేర్..

Posted by venditeravaartha, July 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

భారీ మొత్తంలో ఇన్వెస్ట్ మెంట్ చేసి.. ఎంతో ఎక్స్ పెక్ట్ చుసే సినిమాలు అంచనాలకు భిన్నంగా డిజాస్టర్ గా మిగులుతుంటే.. చిన్న సినిమాలు సైలెంట్ గా దూసుకుపోతున్నాయి. గత ఏడాది కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలకంటే స్మాల్ ఇన్వెస్ట్ మెంట్ చిత్రాలే మంచి విజయాలు సాధించాయని చెప్పొచ్చు. తాజాగా సోలో హీరోగా వరుస విజయాల చిత్రాల్లో నటిస్తన్న శ్రీ విష్ణు నటించి ‘సామజవరగమన’ మూవీ థియేటర్లోకి వచ్చింది. జూన్ 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నాడే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత వీకెండ్ డేస్ కలిసి రావడంతో కలెక్షన్లలో దూసుకుపోతూ పెద్ద సినిమాలకు షాక్ ఇస్తోంది.

smj

వారం రోజులుగా ‘సామజవరగమన’ చిత్రానికి ఊహించని కలెక్సన్లు వచ్చాయి. ఈ మూవీ రూ.3.9 థియేట్రికల్ బిజినెస్ అయింది. బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.4.2 కోట్ల షేర్ రావాలి. 8 రోజులు పూర్తయ్యే సరికి ఈ మూవీ రూ.7.71 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో కేవలం వీకెండ్ లోనే రూ.3.51 కోట్ల ప్రావిట్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీక్ లోనూ ఇదే హవా సాగిస్తే చిన్ని సినిమాల్లో ది బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.

sree vishnu

ఓవరాల్ గా ఈ మూవీకి అయిన బిజినెస్ ను పరిశీలిస్తే నైజాం 2.57 కోట్లు, సీడెడ్ 0.64 కోట్లు, ఉత్తరాంధ్ర 0.79 కోట్లు, ఈస్ట్ 0.42 కోట్లు, వెస్ట్ 0.29 కోట్లు, గుంటూరు 0.40 కోట్లు, కృష్ణా 0.41 కోట్లు, నెల్లూరు 0.21 కోట్లు, తెలంగాణ, ఆంధ్ర కలిపి 5.73 కోట్లు వచ్చాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికొస్తే ఈ మూవీ 1.02 కోట్లు సాధించింది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా సత్తా చాటింది. పాన్ ఇండియా లెవల్లో 0.96 కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ షేర్ మొత్తం 7.71 కోట్లు వసూళ్లు చేసింది.

samajavaragamana

సైడ్ పాత్రల్లో నటించిన శ్రీ విష్ణు ‘అర్జున పాల్గుణ’, ‘భళా తందనాన’, ‘అల్లూరి’ అనే వరుస హిట్ల సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ‘సామజవరగమన’ సక్సెస్ తో శ్రీ విష్ణు మరికొద్దిరోజుల్లోనే స్టార్ హీరోల పక్కన నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్మాల్ ఇన్వెస్ట్ మెంట్ చేసే నిర్మాతలకు శ్రీ విష్ణు మంచి హీరో అని కొందరు అంటున్నారు. ఇక తరువాత ఏ సినిమాతో అలరిస్తాడో చూడాలి మరి.

1689 views