Sreeleela: శ్రీలీడిమాండ్ మాములుగా లేదు గా! ఏకంగా 60 రెట్లు పెంచేసిన రెమ్యూనిరేషన్ !

Posted by venditeravaartha, March 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

‘శ్రీ లీల’ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తరుచుగా వినిపిస్తున్న పేరు , ఆమె పుట్టింది అమెరికా లో అయినా పెరిగింది మాత్రం బెంగళూరు లోనే ,వాళ్ళ అమ్మ గారు ప్రముఖ డాక్టర్, నాన్న గారు పెద్ద వ్యాపార వేత్త . డాక్టర్ కావాలి అనే ఆలోచన తో ఎంబీబీస్ కోర్స్ లో జాయిన్ అయినా 2017 సంవత్సరం లో ఆమె నటించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూసిన కన్నడ డైరెక్టర్ ‘అర్జున్ ‘ గారు తన ‘కిస్’ సినిమా లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. 2019 లో రిలీజ్ అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ,ఆ తర్వాత ఒకటి ,రెండు కన్నడ సినిమా లు చేసాక ,దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి పర్వేక్షణ లో వచ్చిన ‘పెళ్లి సందడి ‘ సినిమా లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా లో హీరో గా శ్రీకాంత్ గారి అబ్బాయి ‘రోషన్ ‘ నటించారు. సినిమా అంతా అంతా మాత్రమే ఆడినప్పటికీ శ్రీలీల కి మంచి పేరు వచ్చింది , ఆమె అందం ,అభినయం ,డాన్స్ ల తో తెలుగు ప్రేక్షకుల ని ఫిదా చేసింది.

Sreeleela's demand is not normal! Remuneration increased by 60 times

పెళ్ళిసందడి తీసుకుని వచ్చిన పేరు తో తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు ఏకంగా 8 సినిమా లు తన చేతి లో ఉన్నాయి అంటే శ్రీలీల కి ఉన్న డిమాండ్ ఏంటో అర్ధమవుతుంది.గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయినా రవితేజ గారి ‘ధమాకా ‘ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా శ్రీలీల ఇమేజ్ ని ఆమాంతం పెంచేసింది.ఈ సినిమా లో ఆమె డాన్స్ కి ఫిదా కానీ వారు అంటూ ఉండరు , ముఖ్యం గా ‘పల్సర్ బండి’ సాంగ్ లో ఆమె రవితేజ గారి తో కలిసి వేసిన స్టెప్స్. తన మొదటి సినిమా ‘పెళ్లి సందడి ‘ కి తాను తీసుకున్న రెమ్యూనిరేషన్ 5 లక్షలు కాగా ధమాకా కి ఆమె తీసుకున్న రెమ్యూనిరేషన్ 50 లక్షలు.

‘వైష్ణవ్ తేజ్ ‘ హీరో గా వస్తున్న ‘PVT4 ‘ లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నారు ,ఇక పోతే క్రేజిస్ట్ ప్రాజెక్ట్ అయినా ‘SSMB 28 ‘ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సరసన నటించే అవకాశం కూడా లభించింది. ఈ సినిమా కి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అలాగే ‘నవీన్ పోలిశెట్టి ‘ గారితో ‘అనగనగా ఒక రాజు ‘ సినిమా లో కూడా నటిస్తున్నారు.

Sreeleela's demand is not normal! Remuneration increased by 60 times

నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కలయిక లో రాబోతున్న ‘NBK108 ‘ లో నటించే అవకాశం ని దక్కించుకుంది.ఇలా వరుసగా చిన్న ,పెద్ద ప్రాజెక్ట్ ల తో బిజీ గా ఉంటున్నారు శ్రీలీల. అయితే దీపం ఉన్నపుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నసామెతను నిజం చేస్తున్నారు శ్రీలీల , తాను మొదట నటించిన ‘పెళ్లి సందడి ‘ సినిమా కి తాను తీసుకున్న రెమ్యూనిరేషన్ 5 లక్షల ని ధమాకా సినిమా కి పది రేట్లు పెంచి 50 లక్షలు అందుకున్న శ్రీలీల ఇప్పుడు ఏకంగా దాన్ని 3 కోట్ల కి పెంచేసింది. ఆమెకి ఉన్న డిమాండ్ ని బట్టి చిన్న సినిమా కి ఒక రెమ్యూనిరేషన్ ,పెద్ద సినిమా కి పెద్ద స్థాయి లోనే రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు.ప్రస్తుతం శ్రీలీల ‘రామ్ పోతినేని ‘, ‘బోయపాటి శ్రీను ‘ కలయిక లో వస్తున్న చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది.

Sreeleela's demand is not normal! Remuneration increased by 60 times

594 views