ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాల లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది తెలియకుండా ఉంది అనే చెప్పాలి.దానికి కారణాలు కూడా ఉన్నాయి అనే చెప్పాలి ఒక పక్క తెలుగు దేశం నుంచి నారా లోకేష్ యువగలం పేరు తో పాద యాత్ర చేస్తున్నారు మరో పక్క జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తున్నారు,అయితే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను ఒక సారి చూస్తే అసలు ఆయన అడుగుతున్న ప్రశ్నలకి వీరు చెప్తున్నా సమాధానాలకి పొంతన లేకుండా ఉంది. దీనికి తోడు పోలీస్ వ్యవస్థ కూడా సరైన రీతిలో లేకపోవడం తో ఇంకో సమస్య వచ్చింది.
జనసేన అధినేత వాలంటరీ వ్యవస్థ గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వకపోగా తమ పార్టీ వారి చేత వాలంటీర్ ల ని ధర్నా ల కి దించి పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలని దగ్ధం చేసిన ఘటనలని కూడా చూసాం అయితే వీటికి నిరసనగా జనసేన వర్గాలు శాంతి యుతంగా చేసిన నిరసనలు ని శ్రీ కాళహస్తి పోలీస్ అయినా సీఐ అంజు యాదవ్ గారు తీవ్రమైన కోపం తో అక్కడ నిరసన చేస్తున్న జనసేన వారి మీద చేయి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయం మీద సీరియస్ అయినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే అక్కడ కి చేరుకొని ఈ విషయం మీద తిరుపతి ఎస్పీ కి కంప్లైంట్ చేయనున్నారు.
అయితే ఈ వివాదానికి కారణం అయినా శ్రీ కాళహస్తి సీఐ అంజు యాదవ్ గారికి ఇది ఏమి అంత కొత్త వివాదం ఏమి కాదు,ఆమె పోలీస్ అయినప్పటి నుంచి ఇలాంటి చాల వివాదాల లో ఆమె హస్తం ఉంది.అయితే శాంతి యుతంగా నిరసన తెలిపే అధికారం ప్రతి భారతీయుడికి ఉంది అనేది రాజ్యాంగం మానికి కల్పించిన హక్కు అయితే దీనిని తుంగలో తొక్కినా అంజు యాదవ్ ని తన పదవి నుంచి తొలిగించాలి అని జనసేన ,టీడీపీ వర్గాలు అంటున్నాయి.ఇక పోతే ఈమె వెనుక కొంత మంది వైసీపీ పార్టీ కి సంబంధించిన పెద్ద నాయకులు ఉన్నారు అని టాక్ ,వారి అండ వలెనే ఈమె ఇలా రెచ్చిపోతున్నారు అంటున్నారు.ఇది వరకు ఇప్పటి వైసీపీ ఎంపీ అయినా మాధవ్ కూడా అప్పట్లో సీఐ గా పని చేసి అక్కడ టీడీపీ వాళ్ళ మీద జులం చూపి ఎంపీ అయినా సంగతి తెలిసిందే.మరి ఈమె కూడా అలాంటింది ఏమైనా ఆశిస్తున్నారు ఏమో.