Sreemukhi: ఎంత విప్పి చూపించిన అవకాశాలు రావడం లేదు..పాపం శ్రీముఖి పరిస్థితి ఇలా అయ్యిందేంటి!

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టీవీల్లో సీరియళ్ల తో పాటు కామెడీ షో లూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. జబర్దస్త్ తరువాత కొన్ని ఛానెళ్లు ప్రత్యేకంగా కామెడీ షోల ను రన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మంది యాంకర్లుగా బుల్లితెరకు పరిచయం అవుతున్నారు. ‘పటాస్’ అనే కామెడీ షో ద్వారా టీవీ రంగంలో అడుగుపెట్టింది శ్రీముఖి ( Sreemukhi ). ఈ ఒక్క షో ద్వారానే ఆమె ఫేమస్ యాంకర్ గా మారిపోయింది. ఆ తరువాత పలు కామెడీ షోల్లోనూ తన యాక్టింగ్ తో అదరగొడుతుంది. అయితే శ్రీముఖి యాంకర్ కావాలని టీవీల్లోకి రాలేదట. ఎప్పటికైనా సినిమా హీరోయిన్ కావాలని తన కోరిక. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. పడరాని పాట్లు పడింది. అయినా భామకు సరైన న్యాయం జరగడం లేదని కొందరు అంటున్నారు. లేటేస్టుగా మరో కొత్త గెటప్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది శ్రీముఖి.
sreemukhi-latest-photos-are-going-viral-on-social-media

సినిమాల్లోకి రావాలని ఎవరికైనా ఉంటుంది. నేరుగా ఇక్కడ అవకాశాలు రావడం గగనమే .అయితే తమ టాలెంట్ ను చూపించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. వీటీలో బుల్లితెర ఒకటి. టీవీల్లో అడుగుపెట్టి… ఆ తరువాత ఫేమస్ హీరోయిన్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మరికొందరు టీవీనే నమ్ముకొని కొనసాగుతున్నవారూ ఉన్నారు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం స్టార్ నటిగా కొనసాగుతున్నారు. హీరోయిన్ కాకపోయినా వరుస అవకాశాలు తెచ్చుకుంటూ బిజీ నటిగా మారిపోయారు.తాను కూడా అలాగే సినిమాల్లో హీరోయిన్ కావాలని యాంకర్ శ్రీముఖి ఎప్పటి నుంచో ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీవీల్లో యాంకర్ గా చేస్తూనే సినిమాల్లో విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ‘నేను శైలజ’ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి శ్రీముఖి ఆ తరువాత క్రేజీ అంకుల్స్ అనే మూవీతో కొన్ని నెలల కిందట వెండితెరపై సందడి చేసింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో శ్రీముఖికి గుర్తింపు రాలేదు. దీంతో శ్రీముఖి సోషల్ మీడియానే నమ్ముకుంది.

anchor-sreemukhi-looks-stunning-in-latest-pics

ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకునే ఈమె అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొజులతో యూత్ గుండెల్లో గుబులు రేపుతోంది. ఆ మధ్య న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొని దుస్తులు లేకుండా ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇవి ఓ వైపు వివాదం అయినా.. మరోవైపు వైరల్ అయ్యాయి. లేటేస్టుగా శ్రీముఖి ఒళ్లంతా బంగారం వేసుకొని దర్శనమిచ్చింది. ఈ గెటప్ ఎందుకో తెలియదు గానీ.. ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావాలనే ఇలా విభిన్నంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక ఈ పిక్ కింద కొందరు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఎంత కష్టపడినా శ్రీముఖికి హీరోయిన్ చాన్స్ రాకపాయే.. అని కామెంట్లు పెట్టడం విశేషం.
anchor-sreemukhi-not-offering-to-movie

Tags :
1212 views