Payal Rajput: కొంత మంది నా జీవితాన్ని నాశనం చేసారు – పాయల్ రాజ్ పుత్

Posted by venditeravaartha, July 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Rx100 సినిమా తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి తన అందం తో తెలుగు వారి కి దగ్గర అయినా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈమె ఆ హిట్ తో చాల తక్కువ సమయం లోనే పెద్ద ఆఫర్ ల ను   అందుకున్నారు. డిస్కో రాజా ,వెంకీ మామ సినిమా ల లో చేసిన ఆ తర్వాత సరైన ఛాన్స్ లు లేక వెబ్ సిరీస్ లు మరియు బోల్డ్ సినిమా లు చేస్తున్నారు.అయితే ఇప్పుడు రమేష్ రాపర్తి డైరెక్షన్ లో రాబోతున్నా తన కొత్త సినిమా మాయ పేటిక లో ఒక కొత్త క్యారెక్టర్ చేసారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మొదటి సినిమా తో స్టార్ హీరోయిన్ స్థాయిలోకి వెళ్లిన తాను కొంత మంది తనని మిస్ గైడ్ చేయడం వలన తన సక్సెస్ తగ్గింది అన్నారు.

payal rajput

అజయ్ భూపతి డైరెక్షన్ లో 2018 లో రిలీజ్ అయినా RX100 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అందులో నటించిన కార్తికేయ కి ఎంత గుర్తింపు వచ్చిందో దానికి డబల్ హీరోయిన్ పాయల్ కి వచ్చింది.కార్తికేయ తో రొమాన్స్ లో ఎలా అయితే చేసిందో అలానే క్లైమాక్స్ లో తన నటన తో అందరిని ఆకట్టుకుంది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు లో గెస్ట్ రోల్ చేసిన మరొక సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించారు.నాగ చైతన్య ,వెంకటేష్(Venkatesh) కలయిక లో వచ్చిన వెంకీ మామ లో మంచి రోల్ చేసిన ఆ తర్వాత రవితేజ గారి డిస్కో రాజా లో సూపర్ క్యారెక్టర్ చేసిన ఈ రెండు సినిమా లు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.

venky mama

మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ తో సినిమా అవకాశాలు వచ్చిన సరైన విజయాలు లేకపోవడం తో తన పక్కన ఉన్న ఇండస్ట్రీ లోని కొంత మంది సన్నిహితుల మాట మేర బోల్డ్ సినిమా లు చేయడం మొదలు పెట్టారు.RDX లవ్ ,త్రీ రొసెస్ ,జిన్నా వంటి సినిమా ల లో నటించిన ఒక్కటి కూడా సరైన బ్రేక్ ఇవ్వలేదు.స్కిన్ షో తో కాకుండా తనలోని నటన కి స్కోప్ ఉన్న సినిమా లు చేసి ఉంటె ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా ఉండే దానిని అని చెప్పుకుని వచ్చారు పాయల్ రాజ్ పుత్(Payal rajput) .మరి మాయ పేటిక తర్వాత అయినా క్యారెక్టర్ బేస్డ్ రోల్స్ వస్తాయి ఏమో చూడాలి.

maaya petika

 

2132 views