Sobhan Babu: గోల్డెన్ ఎరా లో సూపర్ స్టార్స్ గా కొనసాగిన ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు శోభన్ బాబు. అప్పటి సూపర్ స్టార్ కృష్ణ తో పోటాపోటీగా శోభన్ బాబు సినిమాలు ఆడేవి. అప్పట్లో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ ఎలా అయితే టాప్ 2 స్థానాల్లో ఉండేవారో, ఆ తర్వాతి తరం లో కృష్ణ మరియు శోభన్ బాబు అలా ఉండేవారు. ముఖ్యంగా శోభన్ బాబు కి మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ వేరే లెవెల్ లో ఉండేది. అప్పట్లో శోభన్ బాబు సినిమా విడుదల అయ్యిందంటే ఆడవాళ్లు థియేటర్స్ కి క్యూ కట్టేవారు. ఆ తర్వాత ఏ హీరో ఇండస్ట్రీ లోకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ మరియు లేడీస్ ఫాలోయింగ్ సంపాదించిన శోభన్ బాబు తో పోల్చి చూసేవారు. ఆ స్థాయి బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకున్న దిగ్గజ నటుడు ఆయన.
ఇలాంటి లెజెండ్ కి సంబంధించిన వారసులు ఇండస్ట్రీ లోకి వచ్చి శోభన్ బాబు లేజసీ ని ముందుకు తీసుకొని వెళ్లి ఉంటే బాగుండేది అని అభిమానులు కోరుకోవచ్చు , అందులో ఎలాంటి తప్పు లేదు. అప్పటి తరం సూపర్ స్టార్స్ అయినా ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ మరియు కృష్ణం రాజు వారసులు నేడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, తమ టాలెంట్ ని నిరూపించుకొని నేడు ఏ స్థాయిలో ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ వాళ్లతో సమకాలీన రేంజ్ ఉన్న శోభన్ బాబు కొడుకులు మాత్రం ఇండస్ట్రీ కి దూరం గా వ్యాపార రంగం లో రాణిస్తూ జీవితం లో స్థిరపడ్డారు. మొదటి నుండి శోభన్ బాబు కి తన కుటుంబాన్ని ఇండస్ట్రీ కి దూరం గా ఉంచి పెంచడానికే ఎక్కువ ఆసక్తి చూపించాడు. అన్ని సంవత్సరాల ఆయన కెరీర్ లో ఒక్క సారి కూడా తన భార్య బిడ్డలను షూటింగ్ కి తీసుకొని రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు,శోభన్ బాబు పిల్లల్ని ఇండస్ట్రీ కి ఎంత దూరం పెట్టారు అనేది.
అయితే శోభన్ బాబు మనవడు సందేశ్ కి మాత్రం సినిమాల్లోకి రావాలని చాలా కోరిక ఉండేది. కానీ ఆయన తండ్రి మాత్రం అందుకు అంగీకరించలేదట. సినిమా ఇండస్ట్రీ కల్చర్ మన కుటుంబానికి సరిపడదు, మా నాన్న గారు అందుకే మమల్ని దూరం గా ఉంచారు ఇండస్ట్రీకి. అంతే కాదు, సినీ జీవితం గ్యారంటీ లేని జీవితం, ఎప్పుడు సక్సెస్ వస్తుందో, ఎప్పుడు ఫెయిల్యూర్ వస్తుందో మనకి తెలియదు. సక్సెస్ వచ్చినన్ని రోజులు బాగానే ఉంటాం, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం ఇండస్ట్రీ లో మన డిమాండ్ పడిపోతుంది. అలా డిమాండ్ పడిపోయి అడ్రస్ గల్లంతు అయినా మహానటులు ఎంతో మంది ఉన్నారు, కాబట్టి సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉండమని సందేశ్ కి ఆయన తండ్రి అనగా శోభన్ బాబు కొడుకు చెప్పాడట. శోభన్ బాబు మనవడు సందేశ్ ఏ రేంజ్ లో ఉన్నాడో మీరే చూడండి ఈ క్రింది ఫొటోలో.