Skanda : ఫ్లాప్ టాక్ తో నైజాం ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ సాధించిన రామ్ ‘స్కంద’..ఇది మామూలు మాస్ కాదు!

Posted by venditeravaartha, October 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ తెరకెక్కిన ‘స్కంద’ చిత్రం రీసెంట్ గానే విడుదలై మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఊర మాస్ కాంబినేషన్ అవ్వడం తో ఈ సినిమాకి ఓపెనింగ్స్ లో కాసుల కనకవర్షం కురిసింది. అందుకు కారణం అద్భుతమైన విడుదల తేదీ పట్టడమే. సెప్టెంబర్ 28 వ తారీఖు నుండి నిన్నటి వరకు వరుసగా వరుసగా సెలవలు రావడం ఈ చిత్రం పాలిట వరం లాగా మారింది. పైగా చాలా రోజుల నుండి పేరున్న సినిమా ఒక్కటి కూడా రాకపోడం ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎగబడడానికి కారణం అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది రామ్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ సినిమాకి రెండు ప్రాంతాలలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి మాస్ సినిమాలకు సీడెడ్ లో అత్యధిక వసూళ్లు వస్తాయి. కానీ ఈ సినిమాకి సీడెడ్ లో డిజాస్టర్ స్థాయి వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో ఈ చిత్రాన్ని 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు వచ్చింది కేవలం మూడు కోట్ల 30 లక్షల రూపాయిలు మాత్రమే. ఫుల్ రన్ లో ఇంకో కోటి రూపాయిలు అదనంగా రావొచ్చు. కానీ నైజాం ప్రాంతం లో అనూహ్యంగా ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఇక్కడ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. 5 రోజులకు కలిపి 9 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ అవసూల్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా ఆడితే ఈ సినిమా ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ రేంజ్ కి చేరుకుంటుంది.

ఊర మాస్ సినిమా ఫ్లాప్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అవుతుండడం చరిత్ర లో ఇదే తొలిసారి. ఈ సినిమా క్లోసింగ్ లో అన్నీ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అవుతుందో లేదో చెప్పలేము కానీ, హీరో రామ్ కెరీర్ కి మాత్రం ఎలాంటి బొక్క పెట్టలేదు అని మాత్రం చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ లో ఆయన ఇమేజి ఒక మెట్టు పైకి ఎక్కలాగానే ఈ సినిమా ఉపయోగపడింది. ఇక ఈ చిత్రం తర్వాత రాబొయ్యే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకి టాక్ వస్తే స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

285 views