SHYAMALA:అనసూయ బాటలోనే మరో స్టార్ యాంకర్ శ్యామల

Posted by venditeravaartha, April 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బర్దస్త్ యాంకర్ గా సూపర్ పాపులర్ అయిన అనసూయ అడవిశేష్ ‘క్షణం’ సినిమా నుంచి సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరవడం మొదలు పెట్టింది. రెగ్యులర్ పాత్రలతో కాకుండా అనసూయ సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా సినిమాలు చేస్తూ వస్తుంది.అటు బుల్లి తెర మీద కనిపిస్తూనే వెండితెర మీద కనిపిస్తూ బిజీ గా మారింది అనసూయ.

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్త, పుష్ప లో దాక్షాయణి పాత్రలో అనసూయ అలరించింది. అయితే ఇప్పుడు అనసూయని స్పూర్తిగా తీసుకుని మరో యాంకర్ ఆమె బాటలోనే నడుస్తుంది. ఆమె ఎవరో కాదు తెలుగు ప్రముఖ యాంకర్ శ్యామల. బిగ్ బాస్ కి కూడా వెళ్లొచ్చిన శ్యామలా తన మార్క్ యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.2014 లో రిలీజ్ అయినా ‘లౌక్యం’ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన శ్యామల తర్వాత ‘ఒక లైలా కోసం’
‘గుండెల్లో గోదారి,’బెంగాల్ టైగర్ ‘ మొదలగు సినిమా ల లో నటించారు.

ప్రస్తుతం సాయి ధరం తేజ్ విరూపాక్ష సినిమాలో శ్యామల పార్వతమ్మ పాత్రలో నటించింది. ఈ సినిమాతో నటిగా మారి ఇక మీదట వరుస సినిమాలు చేయాలని చూస్తుంది శ్యామల. కచ్చితంగా శ్యామల సినిమాలు చేస్తే ఆమెకు వెండితెర మీద మంచి ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. తెలుగు సినిమాల్లో అక్క, వదినల పాత్రలకు శ్యామల పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆమె యాంకరింగ్ వదిలకున్నా సినిమాలు వరుసగా చేస్తే ఆమె క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

553 views