Rahul Sipligunj : తన లవర్ ను పరిచయం చేసిన రాహుల్ సిప్లిగంజ్.. భోరున ఏడుస్తున్న రతిక

Posted by RR writings, March 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Rahul Sipligunj : సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీ‌ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌ వీడియోలతో జూనియర్‌ సమంతగా క్రేజ్ సంపాదించుకుంది. బిగ్‌బాస్‌తో ఈ బ్యూటీ మరింత పాపులారిటీ దక్కించుకుంది. బిగ్‌బాస్‌ షో సమయంలో బొద్దుగా కనిపించిన అషు… ఇటీవల కాలంలో సన్నబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తరచూ హాట్‌ హాట్‌గా ఫొటోషూట్లతో రెచ్చిపోతుంది. తన బోల్డ్‌ లుక్‌లతో ఫాలోవర్స్‌కి షాకిస్తుంది. ఇక ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్య్వూ ఇచ్చిన మరింత బోల్డ్‌ అనిపించుకుంది. అప్పటి నుంచి సోషల్‌ మీడియా బోల్డ్‌ బ్యూటీగా మారిపోయింది. అయితే అప్పట్లో అషురెడ్డి-సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్‌ అనే వార్తలు హల్ చల్ చేశాయి. వారిద్దరు చాలా ఈవెంట్లో క్లోజ్‌గా ఉండటం, అలాగే ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే షేర్‌ చేశారు.

దాంతో వీరద్దరూ రిలేషన్లో ఉన్నారంటూ గుసగుసలు వినిపించాయి. అయితే వారిద్దరు మాత్రం మేం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకుని తిరుగుతుంటారు. కానీ వారి ఫొటోలు, వారిమధ్య ఉన్న క్లోజ్‌నెస్‌ చూసి వీరిద్దరి మధ్య కచ్చితంగా ఏదో ఉందంటూ నెటిజన్లు వీరిపై కన్నెసేవారు. ఇలా వారిపై గాసిప్స్‌ మొదలైన కొద్ది రోజులు ఇద్దరి మధ్య కాస్తా దూరం పెరిగింది. మనస్పర్థల కారణంగా వీరి రూమర్డ్‌ పెయిర్‌ ఎడమోహం పెడమోహం పెట్టారని సన్నిహితులు చెప్పేవారు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులుగా వీరిద్దరు కలిసిపోయారు. అయితే మాటలు కలిసిన అంతకుముందున్న సన్నిహితం మాత్రం వారి మధ్య కనిపించలేదు. కొంతకాలంగా తన ఫొటోలు, వీడియోలు మాత్రమే షేర్‌ చేస్తూ వస్తున్న అషు తాజాగా ఓ స్పెషల్‌ ఫొటో షేర్ చేసింది.

సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దీనికి ‘ఆల్వేష్ మై బెస్టీ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అంతేకాదే రెడ్‌ హాట్‌ ఎమోజీని కూడా జతచేసింది. ఇది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఇది చూసి నెటిజన్లు వారిద్దరి టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరెమో ‘ఏంటీ మీరిద్దరూ మళ్లీ కలిసిపోయారా ? అంటూ సెటైరికల్ గా కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రాహుల్‌ సిప్లిగంజ్‌, అషురెడ్డి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

450 views