Shruti Haasan: ఆ పార్టీ నుండి MLA గా పోటీ చెయ్యబోతున్న శృతి హాసన్..ట్విస్ట్ మామూలుగా లేదుగా!

Posted by RR writings, October 19, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Shruti Haasan: సౌత్‌లో బిజీగా ఉన్న క్రేజీ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు.. ఇప్పుడు పాన్ వరల్డ్ యాక్ట్రెస్‌గా మారిపోయింది. నటిగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా ఫేమస్ అయిన బ్యూటీ శ్రుతి హాసన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదీ మనసులో దాచుకునే అలవాటు లేదు తనకు. దేనినైనా ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పే అలవాటు ఉంది తనకు.. దేన్నైనా బ్రేక్ చేశానని చెప్పడం ఆమెకు అలవాటు. .. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు సినిమాల్లో చేస్తునే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో కేవలం సీనియర్ నటినటులు మాత్రమే కాకుండా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో హీరోయిన్స్ కూడా రాజకీయాల్లోకి రావడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుండి ఈ ప్రచారం జరుగుతున్నప్పటికీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మక్కల్ ఇయక్కం పార్టీ కూడా పెట్టి దాని అధ్యక్షుడిగా కమల్ హాసన్ కొనసాగుతున్నారు. వారసురాలు కావడంతో ఆమె రాజకీయ ప్రవేశంపై తరచూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా కోయంబత్తూరులో మీడియాతో ఇంటరాక్ట్ సమయంలో ఆమెకు ఇదే ప్రశ్న మరో సారి ఎదురైంది. ఆ సందర్భంలో ఆమె ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని చెప్పారు.

సినిమాల్లో నటిస్తానని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రానని.. కాకపోతే ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తోంది. ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నట్లు మరోసారి చెప్పింది. అదేవిధంగా తొలిసారిగా ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించే చిత్రాల్లోనే కాకుండా కథ నచ్చితే చిన్న చిత్రాల్లోనూ నటించేందుకు సిద్ధమని తెలిపారు. మంచి కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే తనకు ముఖ్యం అన్నారు. తాను తమిళ అమ్మాయినని, ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటిస్తానని చెప్పారు. త్వరలోనే ఓ ఆల్బమ్‌ని కూడా విడుదల చేస్తానని చెప్పారు.

246 views