దుకాణాలు, పార్కింగ్ పాటల ద్వారా రూ. 7.32 లక్షలు ఆధాయం

Posted by venditeravaartha, July 27, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన దుకాణాలు, పార్కింగ్ నిర్వహణకు నిర్వహించిన భహిరంగ వేలం పాటల్లో పంచాయితీ కి రూ. 7.32 లక్షలు ఆధాయం వచ్చింది. ఈ మేరకు శుక్రవారం గ్రామ సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి, ఇన్చార్జి ఇఓపిఆర్డీ బివివి రమణ ల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీకి సంబంధించి దుకాణాలు, పార్కింగ్ నిర్వహణ హక్కు పొందేందుకు వేలంపాటలు నిర్వహించారు. దీనిలో భాగంగా పార్కింగ్ ఫీజులు వసూలు నిమిత్తం రూ. 5.57 లక్షలు హెచ్చు పాటకు బేతినీడి శ్రీనివాసరావు పాటపాడి కైవసం చేసుకున్నారు. అలాగే దుకాణాల ఆశీలు నిర్వహణకు గానూ నల్లల ఆది వెంకటరమణ
రూ.1.75 లక్షల హెచ్చు పాటకు పాటపాడి కైవసం చేసుకున్నారు. గ్రామ నాయకులు, ప్రజల సమక్షంలో నిర్వహించిన ఈ వేలం పాటలో పంచాయతీ సెక్రటరీ భార్గవ్, సచివాలయ సిబ్బంది పలువురు పాటదారులు, ప్రజలు పాల్గొన్నారు

Tags :
66 views