Jr. NTR : జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్..కారణం ఇదే.. !

Posted by venditeravaartha, May 23, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR ) కు ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో జాహ్నవి కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్. ఈ మూవీ లాంచింగ్ నుంచి అప్డేట్ వస్తున్నాయి. లేటేస్టుగా ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలతో పాటు ఫస్ట్ లుక్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఇందులో కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహంతో వారు అరెస్టు కావాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ఆయనకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్టీఆర్ అంటే పడి చచ్చేవారు ఎక్కువే ఉన్నారు.

Jr-NTRs-fans-arrested-in-Andhra-Pardesh

జూనియర్ సినిమా రిలీజ్ అవుతుందని తెలిస్తే వారి హడావుడి మాములుగా ఉండదు. లేటేస్టుగా ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ లుక్ పై వారు చేసిన ఉత్సాహం వారికే మైనస్ గా మారింది. కర్ణాటకలోని ఓ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేసశారు. రాష్ట్రంలో రాబర్ట్ సన్ పేటలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ లేటేస్ట్ మూవీ ‘దేవర’( Devara ) ఫెక్లీలతో డ్యాన్స్ లు చేశారు. అయితే కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దేవర ఫ్లెక్సీలపై మేకలను బలి ఇచ్చారు. అలాగే ఆ రక్తాన్ని ఫ్లైక్సీలపై విసిరేస్తూ రచ్చ చేశారు. ఆ తరువాత మారణాయుధాలతో డ్యాన్స్ లు చేశారు. దీనిని కొందరు వీడియో తీసి నెట్టింట్లో అప్లోడ్ చేశారు. అదికాస్త వైరల్ కావడంతో కొందరు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోరంగంలోకి దిగిన పోలీసులు కొంత మందిని అరెస్టు చేశారు.

Also Read: దేవరలో జాహ్నవి కపూర్ కు నిరాశేనా?

NTR-Fans-Arrested-Allegedly-Killing-Goats

పోలీసులు అరెస్ట్ చేసినవా వారిలో పి శివ నాగరాజు, కే సాయి, జి సాయి, డి నాగభూషణం, వి సాయి, పి నాగేశ్వరరావు ,వైధరణి, కు తదితరులు ఉన్నారయి.కర్ణాటలకోనే కాకుండా ఏపీలోని కొన్ని చోట్ల ఇదే విధంగా ప్రవర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే ఎవరు ఫిర్యాదు చేశారనే విషయం మాత్రం బయటకు రావడం లేదు.ఇదిలా ఉండగా కొందరు ఎన్టీఆర్ దేవరపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇది కన్నడంలో వచ్చిన ఓ హిట్ మూవీని పోలి ఉందని అంటున్నారు.

Tags :
446 views