SHOBITHA-NAGA CHAITANYAనాగ చైతన్య తో వస్తున్న ప్రేమ ,పెళ్లి మీద తన మనసు లోని మాట చెప్పిన శోభిత ధూళిపాళ్ల!

Posted by venditeravaartha, May 9, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

శోభిత దూళిపాళ్ల ఈ మధ్య కాలం సోషల్ మీడియా లో తరుచూ గా వినిపిస్తున్న పేరు ,2018 లో రిలీజ్ అయినా అడివిశేష్ బ్లాక్ బస్టర్ ‘గూఢచారి’ సినిమా తో తెలుగు సినిమా కి పరిచయం అయినా ఈ తెనాలి అమ్మాయి ,ఆ తర్వాత తమిళ ,మలయాళ సినిమా లో బిజీ అయింది,మణిరత్నం గారి పొన్నియన్ సెల్వం సిరీస్ లో మంచి గుర్తింపు లభించింది.అయితే ఒక పక్క సినిమా ల లో బిజీ గా ఉంటూనే మరో పక్క సోషల్ మీడియా లో నాగచైతన్య తో లవ్ ఎఫ్ఫైర్ నడుస్తుంది అంటూ వస్తున్నాయి వార్తలు.

సమంత తో విడాకులు తర్వాత నాగచైతన్య ,శోభిత దూళిపాళ్ల మధ్య స్నేహం ఎక్కువ అయింది అని వారు తరచుగా పార్టీ ల కి ,ఫంక్షన ల కి ,హాలిడేస్ కి బయట వెళ్తున్నట్లు పుకార్లు వచ్చాయి అయితే వీటి అన్నిటిని కొట్టిపారేసిన ఈ జంట ,ఇటీవల లండన్ లో ఒక హోటల్ లో నాగచైతన్య ,శోభిత కలిసి ఉన్న ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది.ఇక అప్పటి నుంచి వీరి మధ్య ఉన్న రిలేషన్ ని కంఫర్మ్ చేసారు అంతా.ఇదే విషయం గురించి కస్టడీ ప్రమోషన్ ల లో చైతన్య ని అడగక ఆమెతో తనకి ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పారు,ఇప్పుడు ఇదే విషయాన్ని శోభిత దగ్గర ప్రస్తావించగా ‘ప్రస్తుతం నేను సినిమా లు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాను ఇలాంటి సమయం లో నా మీద వచ్చే వార్తల ను ,పుకార్లని నేను పట్టించుకోను మరొక సారి ఇలాంటి వార్తలను నేను పట్టించుకోను నా దగ్గర అడగొద్దు అని సీరియస్ గా చెప్తున్నా అంది.

607 views