Flop Movies:ఫ్లాప్ అయినా సినిమాలకు సీక్వెల్స్ తీసి చేతులు కాల్చుకున్న హీరోలు వీళ్ళే!

Posted by venditeravaartha, March 21, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమా ల కి కొనసాగింపు గా సినిమా లు చేస్తుంటారు , కొన్ని కథ పరంగా కొనసాగింపు ఉండేవి ఉంటాయి ,ఇంకొన్ని కాంబినేషన్ ,ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తీస్తుంటారు, బాహుబలి 2 వరకు కూడా మనకి సీక్వెల్ గా వచ్చిన సినిమా లు అంతగా సక్సెస్ సాధించలేదు , మొదట గా రిలీజ్ అయినా సినిమా సూపర్ హిట్ సాధించి ప్రేక్షకుల లో ఆ సినిమా పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్నపుడు దానికి సీక్వెల్ ని తీసి విజయం సాధించాలి అనుకోవడం లో తప్పేమి ఉండదు ,కానీ ప్లాప్ ,యావరేజ్ అయినా సినిమా ల కి కూడా సీక్వెల్ గా సినిమా తీసి చేతులు కాల్చుకోవడం మన సినిమా ఇండస్ట్రీ లో జరిగింది, అలా ప్లాప్ సినిమా కి సీక్వెల్ తీసి అట్టర్ ప్లాప్ గా నిలిచినా సినిమా లు ,ఆ హీరో లు ఎవరో ఒక సారి చూద్దాం.


నందమూరి బాలకృష్ణ హీరో గా సీనియర్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ని సినిమా గా తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు ‘ 2019 జనవరి 9 న రిలీజ్ అయింది , భారీ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా ఆశించిన స్థాయి లో ఆడలేదు ,దానికి తోడు తరువాతి రోజు రిలీజ్ అయినా రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ ‘ సినిమా తో కలెక్షన్స్ కూడా తగ్గాయి,దాంతో ‘ఎన్టీఆర్ కథానాయకుడు ‘ ప్లాప్ గా నిలిచింది , అయితే సినిమా ని ముందుగానే రెండు భాగాలుగా తీస్తున్నం అని చెప్పడం తో ‘ఎన్టీఆర్ మహానాయకుడు ‘ అని మరల ఈ సినిమా కి సీక్వెల్ ని రిలీజ్ చేసారు , ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయినా 43 రోజులకే సీక్వెల్ ని రిలీజ్ చేసారు ,అయితే ఎన్టీఆర్ మహానాయకుడు బాలకృష్ణ గారి కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా నిలిచింది.

2010 లో బాలీవుడ్ లో రిలీజ్ అయినా ‘దబాంగ్ ‘ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్ , ఆ తర్వాత 2012 లో దబాంగ్ కి సీక్వెల్ గా ‘దబాంగ్ 2 ‘ ని తీశారు ,కానీ దబాంగ్ 2
యావరేజ్ గా నిలిచింది, అయినప్పటికీ దబాంగ్ ని ఫ్రాంచైజీ లాగా తీసుకున్న సల్మాన్ ఖాన్ ,ప్రభు దేవా గార్లు 2019 లో దబాంగ్ 2 కి సీక్వెల్ గా ‘దబాంగ్ 3 ‘ ని తీశారు , ఈ సినిమా ప్లాప్ అయింది. దబాంగ్ 3 ఇచ్చిన షాక్ తో ఇంకా దబాంగ్ సిరీస్ ని ఆపేస్తునాం అన్నారు ప్రభుదేవా ,సల్మాన్ ఖాన్.

సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హీరో గా నటించిన హార్రర్ మూవీ ‘చంద్రముఖి’ సూపర్ డూపర్ హిట్ అయింది, దానికి దర్శకుడు వాసు. అయన 2005 లో రిలీజ్ అయినా చంద్రముఖి కి సీక్వెల్ గా ‘నాగవల్లి ‘ అని సినిమా తీశారు. వెంకటేష్ హీరో గా 3 హీరోయిన్ ల తో తీసిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.చంద్రముఖి సినిమా ఎక్కడ అయితే ముగిసిందో ,అక్కడ నుంచే నాగవల్లి సినిమా మొదలవుతుంది. కానీ సినిమా చంద్రముఖి అంత స్థాయి లో లేకపోవడం సరి కదా , ఆ దరిదాపుల్లో కూడా లేకుండా పోయింది. మరి చంద్రముఖి ,నాగవల్లి సినిమా ల కి సీక్వెల్ గా రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 తో ముందుకు రాబోతున్నారు ,మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.


అలానే ఈ మధ్య రిలీజ్ అయినా రవితేజ గారి ‘రామారావు ఆన్ డ్యూటీ ‘ పెద్ద ప్లాప్ గా నిలిచింది,కానీ ఈ సినిమా కి కొనసాగింపు గా సీక్వెల్ ఉంటుంది అని సినిమా యూనిట్ అందరు అన్నారు.
ప్లాప్ అయినా సినిమా కి కూడా కొనసాగింపు గా ఎందుకు సినిమా లు తీస్తారో,తీసి ఎందుకు ప్లాప్ లు మూటగట్టుకొంటారో వాళ్ళకే తెలియాలి.

643 views