Breaking News: భారతదేశ ఉప ప్రధాని గా చంద్రబాబు..ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!

Posted by venditeravaartha, June 6, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

TdpJanasena: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ ని చిత్తుచిత్తు గా ఓడించి, అసలు రాజకీయ మనుగడ జరగడమే కష్టం అనేంతలా దెబ్బ కొట్టారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. చంద్రబాబు వ్యూహాలు, పవన్ కళ్యాణ్ దూకుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా, భారత దేశ ప్రధానిని ఎన్నుకునే స్థాయికి చేరింది. కృష్ణార్జునులు లాగ వీళ్లిద్దరి కలయిక దేశ చరిత్ర లోనే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఇకపోతే పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి, నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ని అందుకున్న ఏకైక పార్టీ గా జనసేన పార్టీ చరిత్రలో నిలిచిపోయింది.

ఐదేళ్ల నుండి పవన్ కళ్యాణ్ ఎదురుకుంటున్న ఆయనకీ ఈ సక్సెస్ సినిమాటిక్ హై అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ప్రభుత్వ ఏర్పాటు లో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది?, ఆయనకీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా?, లేదా హోమ్ మినిస్టర్ పదవిని ఇస్తారా అనే చర్చలు గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో జరుగుతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా అభిమానులకు ఫ్యూజులు ఎగిరే న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో తిరుగుతుంది. అదేమిటంటే చంద్రబాబు నాయుడు ఉప ప్రధాన మంత్రిగా, పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని టాక్. టీడీపీ, జనసేన లేకుంటే కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ని ఏర్పాటు చేసే అవకాశం దాదాపుగా అసాధ్యమే. కాబట్టి స్వయంగా ప్రధాని మోడీ చంద్రబాబు ని ఈ కోరిక కోరినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ అదే కనుక నిజమైతే అటు జనసేన అభిమానులకు, ఇటు టీడీపీ అభిమానులకు జీవితం లో ఎన్నడూ చూడని ఆనందాన్ని చూస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాబొయ్యే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా రేపు పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో అసెంబ్లీ కి ఎన్నికైన అభ్యర్థులతో పవర్ షేరింగ్ విషయమై చర్చలు జరపనున్నారు. అలాగే జూన్ 9 వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ ఎంపీ లతో వెళ్లనున్నారు.

494 views