Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌లో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచింది. అనంతరం వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో హరిహర వీరమల్లు నిలిచిపోయింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు.
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు మే 13న ఎన్నికల జరగనున్నాయి. అది కూడా 4వ విడతలో ఎన్నికల నిర్వహించబోతున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గతేడాది ‘బ్రో’ మూవీతో పలకిరించాడు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమాను దీపావళి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.
‘హరిహర వీరమల్లు’ మూవీ వీఎఫ్‍ఎక్స్ వర్క్స్ ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో జరుగుతున్నాయని ఈ మూవీని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఇటీవల వెల్లడించింది. అందరి ఊహలకు మించి ఈ చిత్రం ఉంటుందని పేర్కొంది. హరిహర వీరమల్లు చిత్రంలో యోధుడిగా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. తొడ గొట్టాలే తెలుగోడు అంటూ రెండేళ్ల కిందట వచ్చిన పవర్ గ్లాన్స్ అదిరిపోయింది. మొఘలుల నాటి బ్యాక్‍డ్రాప్‍లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానుంది.
ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా 4 భాషలకు సంబంధించిన దాదాపు రూ. 60 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడుపోయాయి. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.