Adipursh: ‘ఆదిపురుష్’ టీం సంచలన నిర్ణయం.. ఆయోధ్య ఆలయం..

Posted by venditeravaartha, June 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. నాటకాలు ప్రదర్శించారు.. కానీ కొత్త తరానికి ఎప్పటికప్పుడు రామాయణం గురించి పలు మార్గాల ద్వారా చెప్పాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ కోవలోనే లేటేస్టుగా ఫుల్ గ్రాఫిక్స్ తో ఇప్పటి తరానికి అర్థమయ్యేలా రామయణం కథతో వస్తున్న మూవీ ‘ఆదిపురుష్’(adipursh). ప్రభాస్, కృతి సనన్ లు జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ జూన్6న రిలీజ్ అయింది. 16 జూన్ న థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో ఆదిపురుష్ మేకర్స్ చేసిన ఓ పనికి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

adipursh

రామయణం కథ ఎవరి సొత్తు కాదు.. కానీ ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీయాలంటే మాటలు కాదు. ముఖ్యంగా హిందువుల నుంచి ఎటువంటి రిమార్క్ రాకుండా చూసుకోవాలి. కానీ ఇప్పటికే ఆదిపురుష్ అనేక విమర్శలు ఎదుర్కొంది. సినిమాలోని క్యారెక్టర్ల నుంచి కాస్ట్యూమ్ డిజైన్ వరకు అన్నీ ఆధ్యాత్మికంగా లేవని ఆర్టిఫిషియల్ గా ఉన్నాయని కొందరు ఆరోపించారు. అంతేకాకుండా రాముడు, హనుమంతుడు గెటప్ లను పూర్తిగా మార్చేసి అభాసుపాలు చేస్తున్నారని అన్నారు.

prabhas

ఈ విమర్శల నుంచి బయటపడేందుకు సినీ బృందం ఎన్నో కష్టాలు పడుతోంది. అయితే రిలీజ్ అయ్యే సరికి.. అయిన తరువాత మరెన్నో విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆదిపురుష్ టీం ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణానికి దేశ వ్యాప్తంగా విరాళాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.

team adipursh

ఈ క్రమంలో ఆదిపురుష్ టీం ఈ ఆలయ నిర్మాణానికి విరాళం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే చిన్న మొత్తంలో విరాళం ఇచ్చే విషయం అయితే ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు. సినిమాకు వచ్చిన లాభాల్లో కనీసం కొంత శాతం ఈ ఆలయానికి కేటాయించాలని నిర్ణియంచినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న వ్యక్తే. అందుకే ఆయన రాముని కథతో సినిమా తీస్తున్నందున.. ఆయనకు కృతజ్ఓతగా ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నాడట. అయితే సినిమాకు వచ్చే ఆదాయంలో కనీసం రూ.10 కోట్లైనా విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి రిలీజై అయిన తరువాత ఆదిపురుష్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి..

708 views