Savithri: ఆ పాత్రలో నటించమని అడిగితే సావిత్రికి కోపం వచ్చేదట…!

Posted by venditeravaartha, June 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అలనాటి మేటి నటి సావిత్రి(Savithri) గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. ఆమె నటించిన సినిమాలు వస్తే కొందరు అభిమానంతో కన్నార్పకుండా చూస్తారు. ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసే సావిత్రి ఎవరూ నటించరని అప్పటి అభిమానులు అంటూ ఉంటారు. సావిత్రి సినీ జీవితం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆమె ఎన్నో పాత్రలు చేశారు. ఎన్నో లాంగ్వేజేస్ లో నటించారు. అయితే ఓ పాత్ర విషయానికి వస్తే అమె ససెమిరా అందట. ఈ పాత్ర తనను చేయమని అడిగితే ఏమాత్రం బిడియం లేకుండా వద్దని చెప్పిందట. కొందరు చొరవ తీసుకొని ఫోర్స్ చేస్తే కోపం తెచ్చుకునేదట. ఇంతకీ ఏ పాత్రనో చూద్దాం. విజయవాడకు చెందిన సావిత్రి చెన్నై వెళ్లి సినీ లోకాన్ని ఏలారు. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ అనేక పాత్రల్లో నటించారు.. జీవించారు.

కొన్ని సినిమాలకు అమె సొంతంగా డైరెక్షన్ చేశారు. సావిత్రి సినిమాల్లో ఎంతో అమాయకంగా కనిపించినా రియల్ గా కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరించేదట. తను చేయద్దనుకున పనిని అస్సలు ఒప్పుకునేది కాదట. ఓసారి ఆమెను రామాయణం సినిమా కోసం సావిత్రిని ఓ డైరెక్టర్ సంప్రదించాడట. ఇందులో సీత పాత్ర చేయాలని సావిత్రిని అడిగారట. అంతేకాకుండా ఎన్టీఆర్(Ntr) పక్కన నటించేందుకు మరోసారి రిక్వెస్ట్ చేశారు. అయితే సావిత్రి మాత్రం అస్సలు ఒప్పుకోలేదట. తాను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, కానీ సీత పాత్ర చేయనని చెప్పిందట. ఎందుకంటే సీత పాత్రలో ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఆ కష్టాలను నటనలోనూ ఊహించుకోలేను. అలా చేయడం నా వల్ల కాదు.. అని డైరెక్టర్లకు సావిత్రి తెగేసి చెప్పేదట.

అయితే అనూహ్యంగా ఆ పాత్ర చేయకున్నా.. సావిత్రి సీత కంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొంది. సినీ జీవితం కొన్ని రోజుల పాటు స్వర్ణయుగంలా గడిచినా.. ఆ తరువాత నష్టాలు ఎదురయ్యాయి. ఇక రియల్ లైఫ్ కూడా విషాదంగానే సావిత్రి జీవితం ముగిసింది. ఒక్కోసారి మనం జీవితంలో కష్టాలకూ దూరంగా ఉండాలని ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాం.. కానీ వచ్చే కష్టం రాకమానదు.. అని కొందరు ఈ సందర్భంగా చెప్పుకుంటున్నారు.

1110 views