Samantha: విడాకులు తీసుకోబోతున్న హీరోతో సమంత పెళ్లి..? ఎవరంటే?

Posted by venditeravaartha, June 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత(Samantha) గురించి తెలియని వారు దాదాపు లేరనే చెప్పొచ్చు. ‘ఏమాయ చేశావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో అందరినీ మాయ చేసింది. ఆ తరువాత నాగచైతన్యను సైతం తన అభినయంతో బుట్టలో వేసుకోవడంతో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల దూరమయ్యారనుకో. నాగచైతన్యకు దూరం అయిన తరువాత సమంత గురించి ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి. లేటేస్టుగా మాత్రం సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిప్పులేనిదే పొగ రాదు.. అన్నట్లు సమంత చేసిన కొన్ని కామెంట్స్ ఆధారంగా ట్రోలర్స్ వీరిద్దరి మధ్య ఏదో ఉందని అంటున్నారు. ఇంతకీ సమంత చేసిన ఆ కామెంట్ విషయానికొస్తే..

samantha

నాగచైతన్యతో సమంత దూరం అయిన తరువాత సినిమాల్లో బిజీ అయింది ముద్దుగుమ్మ. అయితే రెండో పెళ్లి విషయం గురించి ఎవరైనా అడిగితే మాత్రం అస్సలు నోరు విప్పేది కాదు. అంతేకాకుండా తన పెళ్లి ప్రస్తావన రాకుండా కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలని సూచలను ఇచ్చేంది. సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీసుల్లో బీజీగా మారింది. ఆమె నటించిన శాకుంతల డిజాస్టర్ కావడంతో అవకాశం వచ్చిన ప్రతీ వెబ్ సిరీస్ ను క్యాష్ చేసుకుంటోంది. లేటేస్టుగా ఆమె ‘సిటాడెల్’(Citadel) అనే వెబ్ సిరీసులో నటించిన విషయం తెలిసింది.

citadel

‘సిటాడెల్’లో సమంతతో పాటు వరుణ్ ధావన్(Varun dhawan) అనే బాలీవుడ్ హీరో నటించారు. వీరిద్దరి మధ్య ఇందులో కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే రియల్ గా కూడా వీరు ఒక్కటవుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సిరీస్ షూటింగ్ జరుగుతున్న కాలంలో ఈ కపుల్స్ హోటల్స్, ప్రత్యేక ప్లేసుల్లోకి వెళ్లారట. ఫూచర్లో ఒక్కటవుతామన్న ఉద్దేశంతోనే వీరు అలా చేశారని నెట్టంట్లో చర్చ సాగుతోంది.

samantha varun

ఇదే సమయంలో సినీ విమర్శకుడు ఉమైర్ చంద్ మరో ఉప్పందించాడు. త్వరలో వరుణ్ ధావన్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని కామెంట్ చేశారు. దీనికి తోడు సమంత కూడా ‘త్వరలో మీకు మేం సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నాం.. ’ అని అనడంతో నెట్టింట్లో రచ్చ రచ్చ అవుతోంది. వరుణ్ ధావన్ తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ సమంతను పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు సమంత అయితే రిప్లై ఇవ్వలేదు. ఇంకనూ కామ్ గా ఉంటే వీటికి బలం చేకూరుతుందని కొందరు అంటున్నారు.

1264 views