Pawan Kalyan :సమంత అప్పట్లో పవన్ కళ్యాణ్ తో ఇంత నడిపిందా..వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్!

Posted by venditeravaartha, March 8, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Pawan Kalyan : సమంత ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అందం ఈమె నవ్వు దశాబ్దాల కాలం పైగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ క్రేజ్ తగ్గని హీరోయిన్ సమంత. తమిళ,తెలుగు, హిందీ భాషల్లో తన నటన ప్రదర్శించి అద్భుతమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ లో ఏం మాయ చేసావే అంటూ వచ్చి ఇప్పటికీ ఇంకా మాయ చేస్తూనే ఉన్నారు సమంత విభిన్న పాత్రలు చేయడం ప్రత్యేకత ఓ బేబీ మూవీ లో 60 ఏళ్ల వయసు శ్రీ గా మాట్లాడుతూ తనకి నటన పట్ల ఉన్న గౌరవం చాటారు సమంత.

సమంత నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుని అభిమానులలో ఆనందాన్ని పెంచారు సమంత అభిమానుల ఆశలు కొన్ని సంవత్సరాల్లోనే విడాకుల రూపంలో తీసేశారు అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టి, నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుని, తరువాత విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది సమంత ఇప్పటికీ ఈ జంట గురించి వాళ్ళు ఇంకా కలుసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి సమంత గురించి వచ్చే ప్రతి వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

సినిమాలు పక్కన పెట్టి తనకున్న మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నారు సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని, తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు చివరగా మన రీసెంట్ గా వచ్చిన ఖుషి మూవీ ఆ సినిమా తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఎప్పటికప్పుడు అభిమానులతో తన ఫొటోలను తన వీడియోలను షేర్ చేస్తూ సమంత అభిమానులతో టచ్ లోనే ఉంటారు. సమంత రీసెంట్ గా తన బికినీలో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసి అందరికీ షాకు గురి చేశారు.వయసు పై పడుతున్న కొద్ది సమంత అందం మాత్రం తగ్గట్లేదని టాక్.సమంత పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు తనకు పవన్ కళ్యాణ్ కు ఉన్న సంబంధం గురించి చెప్పుకొచ్చారు సమంత చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు వైరల్ గా మారింది ఆ వార్త ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

సమంత పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది అందులో యాంకర్ ప్రదీప్ సమంతను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ పవన్ గురించి కూడా చెప్తుంది మొదట ప్రదీప్ ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు హీరోలకి అని అడుగుతాడు మొదటగా జూనియర్ ఎన్టీఆర్ అని అంటాడు వెంటనే సమంత ది గ్రేట్ డాన్సర్ అని అంటుంది తర్వాత సూర్య అని అనగానే స్మార్ట్ అండ్ హార్ట్ అని అంటుంది. మహేష్ బాబు అంటే మోస్ట్ డిసైరబుల్ అని చెప్తారు సమంత ఇక పవన్ కళ్యాణ్ అనగానే పవన్ నా గురువుగారు అని చెప్పుకొచ్చింది తనకు పవన్ కు గురు శిష్యులు అనుబంధం అని చెప్పారు సమంత ఇప్పుడు ఈ వీడియో పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు అత్తారింటికి దారేదిలో పవన్ సమంత కలిసి నటించారు. ఈ మూవీ టాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచింది.

402 views