SAMANTHA:నాగచైతన్య,శోభిత ల వివాదం పైన సమంత ఘాటు వ్యాఖ్యలు

Posted by venditeravaartha, April 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

అక్కినేని నాగచైతన్య రెండవ సినిమా ‘ఏ మాయ చేసావే ‘ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి అడుగు పెట్టారు సమంత ,తర్వాత వరుసగా బృందావనం ,దూకుడు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈగ ,అత్తరెంటికి దేరేది,మనం వంటి బ్లాక్ బస్టర్ ల లో నటించింది.తన మొదటి సినిమా నుంచే చైతన్య తో పరిచయం కాస్త ప్రేమ గా మారి 2017 లో వివాహం చేసుకున్నారు.వీరు విడిపోయాక కొన్ని రోజులకి నాగ చైతన్య, శోభిత ధూళిపాళల ఎఫైర్‌పై టాలీవుడ్ ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి.అయితే ఈ ఇద్దరూ చాలా కాలంగా పుకార్ల గురించి పెదవి విప్పలేదు, అయితే ఇటీవలి సంఘటనలు వారి సంబంధాన్ని వెలుగులోకి తెచ్చాయి.

ఒక ప్రముఖ రెస్టారెంట్ చెఫ్ నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. ఈ లీక్ అయిన ఫోటో వారి సంబంధం గురించి మరింత ఊహాగానాలకు ఆజ్యం పోసింది.మరోవైపు సమంత పుకార్లపై ప్రశాంతంగా మరియు పరిపక్వతతో స్పందించింది. ఆమె మాట్లాడుతూ, “ఎవరితో సంబంధం కలిగి ఉన్నారనే దాని గురించి నేను బాధపడటం లేదు. ప్రేమ విలువ తెలియని వారికి ఎంతమందితో సంబంధం కలిగి ఉన్నపటికీ చివరికి కన్నీళ్లు మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది”.

సమంతా తన పీరియాడికల్ డ్రామా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది, ఇది ఏప్రిల్ 14, 2023న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ కానున్నది. ప్రముఖ అమెరికన్ యాక్షన్ డ్రామా ‘సిటాడెల్’ యొక్క భారతీయ రీమేక్‌లో కూడా ఆమె వరుణ్ ధావన్‌తో కలిసి నటించింది.

1216 views