SAMANTHA:తన రెమ్యునరేషన్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు

Posted by venditeravaartha, March 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాని తెలుగు రాష్ట్రాల లో రిలీజ్ చేస్తున్నారు .ఈ సినిమాకు మణిశర్మ సంగీతం, ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ,తన వర్క్, ఆరోగ్య, తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇటీవలే తన పారితోషికానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్. తను రెమ్యూనరేషన్ కోసం ఎవర్నీ అడుక్కోనని, తన హార్డ్ వర్క్, విజయాలతోనే కావాల్సినంత దక్కించుకుంటానని స్పష్టం చేసింది. సినిమా విషయం లో నేను చాలా గట్టిగా ఫైట్ చేస్తాను. పారితోషికంగా సమానంగా ఉండాలని నేను పోరాటం చేయను. హార్డ్ వర్క్, సక్సెస్‌తో ద్వారా వచ్చే ప్రొడక్ట్‌ను కావాలనుకుంటున్నాను. నిర్మాతలే వచ్చి మేము మీకు ఇంత చెల్లించాలనుకుంటున్నాము అని చెప్పాలి. అందుకోసం నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి పరిస్థితి రావాలి అంటే చాల శ్రమించాలి , తీవ్రమైన హార్డ్ వర్క్ తర్వాత వస్తుందని నేను నమ్ముతాను.” అని సమంత స్పష్టం చేసింది. అయితే అప్పట్లో సమంత తెలుగు సినిమా కు 3 కోట్ల రూపాయలు తీసుకునే వారు ,బాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుంచి తన రెమ్యూనిరేషన్ రెట్టింపు అయింది, తన చివరి సినిమా ‘యశోద’ కి 6 కోట్ల రూపాయలు తీసుకున్న సమంత , రిలీజ్ కి రెడీ కాబోతున్న శాకుంతలం కి 8 కోట్ల మేర తీసుకునట్లు సమాచారం.

తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా స్పందిస్తూ ,గతేడాది మయోసైటిస్ ఆనే ఆటో ఇమ్యూన్ హెల్త్ కండీషన్‌తో బాధపడుతున్నప్పుడు తన నిర్మాతలు, దర్శకులు ఎంతో మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది.ఏ రోజు ఒకేలా ఉండదు. ప్రతి రోజూ విభిన్నంగా ఉంటుంది. అక్కడ ఎత్తు, పల్లాలు ఉంటాయి. అందులోనూ మరీ అల్పాలు కూడా ఉంటాయి. నా నిర్మాతలు, దర్శకులు నా కోసం వెయిట్ చేశారు. అవసరమైన ఎనర్జీని ఇచ్చారు. అందుకు నేను నిజంగా కృతజ్ఞురాలినై ఉంటాను. అదే తిరిగి సెట్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా ఫైట్ చేయాలని కోరుకునేలా చేసింది.” అని స్పష్టం చేసింది.

594 views