SAMANTHA:గుడిలో దేవత గా మారనున్న సమంత!

Posted by venditeravaartha, April 26, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ ల లో ఒకరు అయినా ‘సమంత ‘ గారు అరుదైన గౌరవం అందుకోనున్నారు ,సినిమా అవార్డు ,లేక ప్రభుత్వం ఇచ్చే అవార్డు అనుకుంటే పొరపాటే.సాక్షాత్తు గుడి లో దేవత గా ఉండబోతున్నారు సమంత.

2010 లో రిలీజ్ అయినా గౌతమ్ మీనన్ ,నాగ చైతన్య కలయిక లో వచ్చిన క్లాసికల్ ఎపిక్ లవ్ స్టోరీ ద్వారా తెలుగు సినిమా కి పరిచయం అయినా సమంత గారు ,ఆ తర్వాత చాల తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు,బ్లాక్ బస్టర్ సినిమా ల లో నటిస్తూనే సేవ కార్యక్రమ ల లో కూడా పాల్గొనే వారు,ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చాల మంది చిన్న పిల్ల కి , ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు ,వారికీ కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ ఈ ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు,ఇవే కాకుండా పలు సామాజిక కార్యక్రమ ల లో పాల్గొంటూ సమాజం పట్ల తనకి ఉన్న బాధ్యత ని నెరవేరుస్తున్నారు.

అయితే సమంత చేస్తున్న సేవ ,తన నటన చూసి తనకి వీరాభిమాని గా మారిన ఒక అభిమాని తనకి గుడి కట్టిస్తున్నాడు,బాపట్ల జిల్లా కి చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంత కి వీరాభిమాని,తాను చేస్తున్న సేవ కి ఆమె కోసం ఏమైనా చేయాలి అని ,ఆమె విగ్రహం తయారు చేయించి ,తన ఇంటి పరిసరాల లోనే గుడి కట్టిస్తున్నాడు,అయితే ఇప్పటి వరకు యావత్ ఇండియా లోనే ఒక నటి కి గుడి కట్టించిన చరిత్ర ఒక్క ఖుష్బూ కి మాత్రమే ఉండేది ,ఇప్పుడు ఆ జాబితా లోకి సమంత గారు కూడా చేరబోతున్నారు.ఏప్రిల్ 28 నా సమంత గారి విగ్రహం ప్రతిష్టించి గుడి ఓపెన్ చేయనున్నారు.

Tags :
704 views