Samantha: నాగచైతన్య కంటే ముందే అతడితో అన్నీ చేశా.. నిజాలను బయటపెట్టిన సమంత

Posted by RR writings, March 2, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Samantha: స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో విడాకులు కూడా తీసుకున్నారు. అయితే వీరు విడాకులు తీసుకున్న ఇన్నేళ్ల తర్వాత కూడా వారి గురించిన వార్తలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత తన తొలి ప్రేమపై బహిరంగ వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య కంటే ముందు తాను ఒకరిని ప్రేమించానని తెలిపింది. సమంత తన మొదటి సినిమా హీరోనే పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య-సమంతల ప్రేమ వివాహం 2014లో గోవాలో జరగగా.. నాలుగేళ్ల వైవాహిక జీవితంలో గొడవల కారణంగా 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే అంతకు ముందు ఒకరిని ప్రేమించానని, నాగ చైతన్య తన మొదటి ప్రేమ కాదని సమంత వెల్లడించింది.

సమంత చదువుకునే రోజుల్లో పల్లవరం నుంచి చెన్నైలోని టీనగర్ వెళ్లాలంటే రెండు బస్సులు మారాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఓ కుర్రాడు సమంత కోసం రోజూ బస్టాప్‌లో వేచి ఉండేవాడు. స్కూల్‌కి వెళ్లేటప్పుడు సమంతను ఫాలో అయ్యేవాడట.. కానీ, ఎప్పుడూ దగ్గరికి రాలేదని చెప్పింది. అతను కొన్ని అడుగుల దూరం మెయింటెయిన్ చేస్తూ ఫాలో అయ్యాడని చెప్పింది. రెండేళ్లుగా ఫాలో అవుతున్న అతని దగ్గరకు వెళ్లి ఓ రోజు ఎందుకు ఫాలో అవుతున్నావ్ అని అడిగాను. నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ, అదేమీ లేదని అన్నాడట.. దాంతో సమంత తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. అది ప్రేమో కాదో తెలియదు కానీ సమంత మాత్రం అదే తన తొలి ప్రేమ అని చెప్పింది. సమంత మాటలను బట్టి చూస్తుంటే సమంతకు కూడా నచ్చిందేమో కానీ ఆ వ్యక్తి పిరికివాడు కాబట్టి తన ప్రేమను ఆమెకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడో లేదో.. తన తొలి ప్రేమపై సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

527 views