Samantha: అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న సమంత.

Posted by venditeravaartha, July 5, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఏమాయచేసావే సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సమంత అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.టాలీవుడ్ ,కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో ల సరసన నటించిన సమంత(Samantha) హైయెస్ట్ రెమ్యూనిరేషన్ తీసుకున్న హీరోయిన్ గాను రికార్డు సృష్టించారు.. టాలీవుడ్ స్టార్ అయినా అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత గారు 2021 లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే.వీరు విడిపోవడానికి పలు కారణాలు ఉన్నపటికీ కూడా ముఖ్యంగా సమంత గారు నటించిన కొన్ని బోల్డ్ సినిమా ల వలనే వీరు ఇద్దరు విడిపోవడానికి కారణం అని తెలిసిందే.

oh baby

నాగ చైతన్య తో పెళ్లి తర్వాత రంగస్థలం,ఓ బేబీ(Oh baby) ,యూ టర్న్ ,జాను వంటి సినిమా లో చేసిన సమంత వీటి తో పాటు తమిళ్ లో సూపర్ డీలక్స్ ,హిందీ లో ఫ్యామిలీ మాన్ వంటి వెబ్ సిరీస్ ల లో కూడా నటించారు.ఈ రెండు సినిమా ల లో సమంత బోల్డ్ గా నటించడం తో చైతన్య తో కొన్ని విభేదాలు వచ్చాయి అని తెలుస్తుంది.ఈ మధ్య కాలం లో సమంత గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన ని పుష్ప లో ఐటెం సాంగ్ చేయొద్దు అని ఆదేశించారు అని చెప్పింది,
సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మనం ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఉంటుంది అని చెప్పారు.

shakunthalam

పుష్ప సినిమా తర్వాత సమంత గారు చేసిన సినిమా ల లో యశోద సూపర్ ప్లాప్ గా నిలవగా ఇటీవల రిలీజ్ అయినా గుణ శేఖర్ గారి శాకుంతలం మూవీ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది
ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తరువాత రెమ్యూనిరేషన్ పెంచిన సమంత గారు ప్రతి సినిమా కి దాదాపు గా 5 నుంచి 8 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారు.యశోద సినిమా ప్లాప్ తర్వాత తన రెమ్యూనిరేషన్ నిర్మాతల కి తిరిగి ఇచ్చేసారు సమంత.ఇక శాకుంతలం మూవీ కి 8 కోట్ల తన రెమ్యూనిరేషన్ ని కూడా తిరిగి ఇచ్చేసిన సమంత గారు ఇప్పుడు చేస్తున్న హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ తర్వాత తాను సినిమా ల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది.

samantha

2325 views