Samantha :నాగచైతన్య నాకు కాపలా కుక్కలాంటి వాడు అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్!

Posted by venditeravaartha, July 4, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Samantha: కొన్ని ప్రేమ జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు అయ్యాక విడిపోయినప్పుడు అభిమానులకు, ప్రేక్షకులకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఆ జంట అంత చూడ ముచ్చటగా ఉంటుంది కాబట్టి. అలాంటి జంటలలో ఒకటి సమంత నాగ చైతన్య జంట. రీల్ లైఫ్ లో సరైన జోడిగా అనిపించుకున్న ఈ జంట, రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదటి మూడు సంవత్సరాలు కాపురం అద్భుతంగా సాగింది. కానీ ఆ తర్వాత ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వీళ్ళు విడిపోయిన సంగతి వాళ్లిద్దరూ కూడా మర్చిపోయి ఉండొచ్చు కానీ, జనాలు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. ప్రతీ రోజు వీళ్లిద్దరికీ సంబంధించి ఎదో ఒక వార్త గత మూడు సంవత్సరాల నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా గతం లో సమంత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. యాంకర్ సమంత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నీకు బాగా ఇష్టమైన పెట్ ఏమిటి’ అని అడగగా, దానికి సమంత సమాధానం చెప్తూ ‘మా ఇంట్లో ఉన్న ఒక కుక్క, ఆ తర్వాత నాగ చైతన్యనే నా పెట్’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.

పెట్ అంటే పెంపుడు జంతువు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కామెంట్స్ కి అక్కినేని అభిమానులు కొంతమంది బాగా నొచ్చుకున్నారు. మా అభిమాన హీరో ని కుక్కతో సమానం అని పోలుస్తావా అంటూ అప్పట్లో పోస్టులు కూడా పెట్టేవారు. కానీ సమంత సరదాగా చేసిన కామెంట్స్ కాబట్టి ఆ తర్వాత అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే నాగ చైతన్య పుట్టినరోజు సమయం లో ఆయనకీ శుభాకాంక్షలు తెలియచెయ్యకుండా, తన వద్దనున్న పెంపుడు కుక్కలకు శుభాకాంక్షలు చెప్తూ ఆ మధ్యకాలం లో సమంత ఒక పోస్టు పెట్టింది. దీనిని బట్టీ ఆమె నాగ చైతన్య కి ఎలాంటి విలువ ఇస్తుందో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో అక్కినేని ఫ్యాన్స్ అప్పట్లో పోస్టులు వేశారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న తర్వాత ఒక ఏడాది వరకు కెమెరా కి, లైటింగ్స్ కి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించడం తో ఆమె సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రీసెంట్ గా ఆమె తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది. ఈ ఏడాది చివరి నుండి ఆమె మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

307 views