SAMANTHA-AKHIL:సమంత రికార్డు ని బ్రేక్ చేయలేకపోయినా అఖిల్ !

Posted by venditeravaartha, May 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

2023 లో తెలుగు సినీ పరిశ్రమ కి మంచి ఆరంభమే వచ్చింది అని చెప్పాలి ,సంక్రాంతి కి రిలీజ్ అయినా వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా ,బాలయ్య బాబు ‘వీర సింహ రెడ్డి’ సూపర్ హిట్ అయింది,అలానే తమిళ స్టార్ హీరో విజయ్ ‘వారసుడు’,ధనుష్ ‘సార్’ సినిమా లు కూడా హిట్ గా నిలిచాయి .చిన్న సినిమా లు గా రిలీజ్ అయినా బలగం ,వినరో భాగ్యము విష్ణు కథ,రైటర్ పద్మభూషణ వంటి సినిమా లు బ్లాక్ బస్టర్ అయ్యాయి.అలానే నాని దసరా బ్లాక్ బస్టర్ సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరగా,రీసెంట్ గా రిలీజ్ అయినా సాయి తేజ్ ‘విరూపాక్ష’ ఇప్పటికే 50 కోట్ల క్లబ్ ధాటి సూపర్ బ్లాక్ బస్టర్ అయింది.ఇక్కడ వరకు బాగానే ఉన్నపటికీ కొన్ని సినిమా లు భారీ బడ్జెట్ తో నిర్మించి డిజాస్టర్ గా నిలిచాయి.అందులో ఎక్కువగా చెప్పుకోవాలి అంటే అఖిల్ ‘ఏజెంట్’,సమంత ‘శాకుంతలం’.

పైన చెప్పిన హిట్ సినిమా ల కి ఎక్కువ గా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు ,సినిమా బాగుంటే హిట్ అవుతుంది ,కలెక్షన్ లు వస్తాయి కానీ సినిమా ప్లాప్ అయినా ,ఒక వేళా సినిమా రిజల్ట్ ముందే తెలిసిందని నిర్మాతలు అనుకున్న ఆ సినిమా ల ని భారీ ప్రమోషన్ ల తో జనాల్ని థియేటర్ దగ్గర కి రప్పిస్తారు కానీ ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేయడం కానీ ,లేక పోతే ఆన్లైన్ వెబ్సైటు ల కు డబ్బులు ఇచ్చి పాజిటివ్ గా రివ్యూ లు రాయించడం కానీ చేయడం లేదు. అందుకు పైన చెప్పిన ‘శాకుంతలం’,’ ఏజెంట్’ సినిమా లే ఉదాహరణ లు.

శాకుంతలం సినిమా విడుదల రోజున ఏ వెబ్ సైట్ లోను విడుదల ప్రకటన ఇవ్వలేదు,ఏ చిన్న సినిమా కి అయినా లాండింగ్ ప్రకటన ఉంటుంది ,కానీ సమంత లాంటి పెద్ద హీరోయిన్ గుణశేఖర్ లాంటి బడా డైరెక్టర్ లు ఉన్న సినిమా కి కనీసం లాండింగ్ పోస్ట్ లేదు,అలానే నిర్మాత 70-80 కోట్ల బడ్జెట్‌గా ప్రకటించిన ‘ఏజెంట్’ కోసం ఒక షేర్డ్ ల్యాండింగ్ పేజీ మాత్రమే ఇవ్వబడింది.అంటే సినిమా కి పెట్టిన ఖర్చు లో 0 .0001 % కూడా ఖర్చు చేయలేదు.ఆశ్చర్యకరం ఏంటి అంటే స్ట్రెయిట్ తెలుగు సినిమా #Agent కంటే తమిళ డబ్బింగ్ చిత్రం #PS2 విడుదల సమయంలో వెబ్‌సైట్‌లలో మెరుగైన ప్రకటనలు వేయడం.ఫ్లాప్ చిత్రాలకు వెబ్‌సైట్‌లలో ప్రచారం చేయడం డబ్బులు ఇచ్చి పాజిటివ్ ప్రకటన లాగా వెబ్‌సైట్‌లు ఎలాగైనా ప్రతికూల సమీక్షలను వ్రాస్తాయని నిర్మాతలు భావించి ఉండవచ్చు. లేదా వారు నిజంగా ,సినిమా విడుదల సమయంలో బడ్జెట్ కొరతను ఎదుర్కొని ఉంటారు.

వాళ్ళ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ లు గా మిగిలిన ఏజెంట్ ,శాకుంతలం లో సమంత నే గెలిచారు అని చెప్పొచ్చు, #శాకుంతలం డిజాస్టర్ రివ్యూలు ఉన్నప్పటికీ $250k ప్లస్ వసూలు చేసింది. #ఏజెంట్ $200k మాత్రమే కలెక్ట్ చేయగలిగింది.నిర్మాతలు తమ స్టార్లకు ఏ మాత్రం విలువ ఇవ్వకపోవడం, పబ్లిసిటీ అంశాన్ని పట్టించుకోకపోవడం బాధాకరం.అడవి శేష్ మరియు నాని వంటి నటులు తమ నిర్మాతలకు వెబ్‌సైట్లలో మంచి ప్రకటనలు ఇవ్వాలని ఎల్లప్పుడూ పట్టుబట్టారు, ఎందుకంటే ఇది వారి విదేశీ మార్కెట్ వృద్ధికి కూడా సహాయపడింది.సినిమా ఎలాగైనా ఫ్లాప్ అవుతుందని నిర్మాతలు ముందే నిర్ణయించుకున్నందున స్టార్స్ తమ సినిమాల పబ్లిసిటీని నిర్మాతలు విస్మరించకుండా చూసుకుంటారు.

585 views