SALMAN KHAN:డిజాస్టర్ సినిమా తో 100 కోట్ల కలెక్షన్ ఎలా స్వామి ! అసలు ఆ సినిమా ఏంటో తెలుసా ?

Posted by venditeravaartha, May 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా పర్లేదు బాగుంది అంటే ఆ సినిమా కి బ్లాక్ బస్టర్ హిట్ గా చేసే సినిమా ప్రేక్షకులు అదే సినిమా ప్లాప్ టాక్ వస్తే ఇక దానిని అస్సాం కి పంపిస్తారు,కానీ ఈ సెంటిమెంట్ ని కొంత మంది హీరో లు బ్రేక్ చేస్తుంటారు,వారి సినిమా ఎంత డిసాస్టర్ టాక్ వచ్చిన కలెక్షన్ లు మాత్రం వస్తాయి ఆ హీరో కి ఉన్న ఫ్యాన్ బేస్ ,మార్కెట్ వలన డిసాస్టర్ అయినా సినిమా లు కూడా మంచి కలెక్షన్ లనే సాధించాయి,ఇప్పుడు ఆ జాబితా లో చేరారు బాలీవుడ్ సూపర్ స్టార్ ‘సల్మాన్ ఖాన్’.ఏప్రిల్ 21 నా రంజాన్ కానుకగా రిలీజ్ అయినా సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఎంత డిసాస్టర్ టాక్ తెచ్చుకుందో అందరికి తెలిసిందే ,ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేసి అందర్నీ షాక్ కి గురి చేససింది.

తమిళ్ స్టార్ హీరో అజిత్ నటించిన వీరం సినిమా ని తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ‘కాటంరాయుడు ‘ గా రీమేక్ చేసారు.ఇదే సినిమా ను సల్మాన్ ఖాన్ హిందీ లో 150 కోట్ల బడ్జెట్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ గా చేసారు.మొదటి వారం బాలీవుడ్ మీడియా ని మేనేజ్ చేసుకుని పాజిటివ్ రివ్యూ లు రాయించిన టీం.రంజాన్ పండగ ని క్యాష్ చేసుకుని యావరేజ్ కలెక్షన్ ల తో నడిచిన ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది.

సినిమా డిసాస్టర్ అయినప్పటికీ 100 కోట్ల మార్క్ ని అందుకోవడం లో సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటో అర్ధం అవుతుంది. 80 కోట్ల బడ్జెట్ ల తో తెలుగు లో తీసిన అఖిల్ ఏజెంట్ ,సమంత ల శాకుంతలం సినిమా లు మొదటి 3 రోజుల తర్వాత అస్సాం అయ్యిన సంగతి తెలిసిందే,కానీ ఇంత డిసాస్టర్ టాక్ వచ్చి ,ట్రోల్ల్స్ వచ్చినప్పటికీ 100 కోట్ల కలెక్షన్ అంటే అది సల్మాన్ ఖాన్ కి మాత్రమే సాధ్యం అయింది అనే చెప్పాలి.

553 views