మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సినిమా తెలుగు రాష్ట్ర ల లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ,హిందీ లో రిలీజ్ కి రెడీ అవుతున్న తరుణం లో ఒక న్యూస్ బయట కి వచ్చి సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.అది ఏంటి అంటే 2021 సంవత్సరం రోడ్ ఆక్సిడెంట్ కి గురి అయినా సాయి తేజ్ చాల నెలలు హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ,రికవరీ అయినా తర్వాత తీసిన సినిమా నే ‘విరూపాక్ష’, అయితే సాయి తేజ్ ని ఆక్సిడెంట్ అయినా సమయం లో తన ని కాపాడి ,హాస్పిటల్ లో జాయిన్ చేసిన ‘అబ్దుల్ ఫర్హాన్’ సంచలన కామెంట్స్ చేసాడు మెగా ఫ్యామిలీ మీద.
సాయి తేజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయం లో మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి ,పవన్ కళ్యాణ్ గారు సాయి తేజ్ ని కాపాడి మానవత్వం చూపించిన అబ్దుల్ కి రివార్డ్ కింద లక్షల రూపాయలు ఇచ్చారు అని సోషల్ మీడియా లో వచ్చింది,అందరు కూడా అది నిజమే అనుకున్నారు.దానికి తోడు మొన్న సాయి తేజ్ విరూపాక్ష కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనని కాపాడిన వ్యక్తి కి ఆర్ధిక సహాయం చేయలేదు అని ,కేవలం డబ్బు ఇచ్చి తనని దూరం పెట్టలేను అని అన్నారు,తన టీం ద్వారా తన నెంబర్ ఇచ్చాను అని ,తన తో టచ్ లో ఉన్నాం అని అన్నారు.
ఈ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత కొన్ని సోషల్ మీడియా ల కి ‘అబ్దుల్ ‘ ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.మెగా ఫ్యామిలీ ,సాయి తేజ్ మీకు హెల్ప్ చేసారా ,మొబైల్ నెంబర్ ఇచ్చారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ ‘ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా తనకి ఒక్క రూపాయి ఇవ్వలేదు అని ,మెగా ఫాన్స్ ఎవరు కూడా తనని కలవలేదు అని అన్నారు,అయితే సోషల్ మీడియా వచ్చిన ఫేక్ న్యూస్ ల వలన ఇంతకు ముందు తాను చేస్తున్న జాబ్ కూడా మానేసాను అని ఆవేదన వ్యక్తం చేసాడు.CMR లో స్టాఫ్ ,అక్కడ కి వచ్చిన వారందరు మెగా ఫ్యామిలీ మీకు ఎంత ఇచ్చారు ,చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,సాయి తేజ ఎంత ఇచ్చారు అని అడిగి అడిగి అక్కడ నుంచి మానేశా లా చేసారు అన్నారు.అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయినా సందర్భం లో సాయి తేజ్ గారిని కలిసి విషెస్ చెప్పాలి అని ఉంది అని ,కానీ ఆ అవకాశం కూడా లేదు అని అన్నారు.