SAI PALLAVI: సూపర్ స్టార్ మహేష్ తో ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిన సాయి పల్లవి ! స్టార్ హీరో లు అంటే సాయి పల్లవి కి ఎందుకు పడదు.

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్ ల లో సాయి పల్లవి(SAI PALLAVI) ది ప్రత్యేకమైన స్టైల్ అనే చెప్పాలి ఇప్పటి వరకు తాను నటించిన అన్ని సినిమా లు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా తన కంటూ ప్రత్యేకమై క్యారెక్టర్ ఉండేట్లు చూసుకుంటారు సాయి పల్లవి.ఒక సారి ఆమె తెలుగు లో చేసిన సినిమా లను చూస్తే ఫిదా ,మిడిల్ క్లాస్ అబ్బాయి,లవ్ స్టోరీ ,పడి పడి లేచే మనసు,శ్యామ్ సింగరాయ్,విరాట పర్వం ల లో ఆమె నటన కి ఆస్కారం ఉన్న పాత్ర ల నే ఎంచుకుంటారు.ఇండస్ట్రీ కి వచ్చి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ పెద్ద స్టార్ హీరో ల తో నటించలేదు ,దానికి కారణాలు ఎన్ని ఉన్నపటికీ ఆమె దగ్గర కి వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసుకుంది సాయి పల్లవి.

పెద్ద హీరో ల తో ఆఫర్ వస్తే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా సెటల్ అయిపోదాం అనుకునే ఈ రోజుల్లో ఈ న్యాచురల్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నటించే అవకాశం వచ్చిన సున్నితంగా రిజెక్ట్ చేసింది.అనిల్ రావిపూడి ,సూపర్ స్టార్ మహేష్ బాబు కలయిక లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సరిలేరు నీకెవ్వరూ'(SARILERU NEKEVVARU) సినిమా లో మొదట హీరోయిన్ గా సాయి పల్లవి ని అనుకున్నారు డైరెక్టర్ ,అయితే ఆ క్యారెక్టర్ తనకి నచ్చకపోవడం తో సాయి పల్లవి మహేష్ బాబు(MAHESH BABU) గారితో నటించే అవకాశం ని కోల్పోయారు.ఇక ఆ బంపర్ ఛాన్స్ ని నేషనల్ క్రష్ ‘రష్మిక'(RASHMIKA)దక్కించుకున్నారు.కొంత మంది మొదట్లో సాయి పల్లవి నిర్ణయాన్ని తప్పు పట్టిన ఆ తర్వాత ఆమె తీసుకున్నదే కరెక్ట్ అని అభిప్రాయానికి వచ్చారు.

ఇక శ్యామ్ సింగరాయ్(SHYAM SINGHA ROY) సినిమా తర్వాత తెలుగు లో ఏ సినిమా కూడా చేయని సాయి పల్లవి రీసెంట్ గా ‘శివ కార్తికేయన్'(SIVA KARTHIKEYAN) తో తమిళ్ లో ఒక సినిమా లో నటిస్తున్నారు.ఈ సినిమా ఈ మధ్య నే ప్రారంభం కూడా అయింది.కమల్ హాసన్ ,సోనీ పిక్చర్స్ వారు కలిసి ఏ సినిమా ని నిర్మిస్తున్నారు.రాజ్ కుమార్ పెరియ స్వామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.మరి ఈ సినిమా తర్వాత అయినా సాయి పల్లవి తెలుగు లో చేస్తుందో లేదో చూడాలి.

819 views