RX100:RX100 కి సీక్వెల్ రానుందా ?

Posted by venditeravaartha, April 25, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసిన వారు ఇప్పుడు ఏ స్థాయి లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ,కృష్ణ వంశి ,పూరి జగన్నాధ్ ,తేజ ,శివ నాగేశ్వర రావు లాంటి సీనియర్ డైరెక్టర్ లు తెలుగు సినిమా లో టాప్ పొజిషన్ కి వెళ్లారు,వారి తర్వాత వచ్చిన యంగ్ డైరెక్టర్ ల లో హరీష్ శంకర్ ,అజయ్ భూపతి లాంటి వారు సూపర్ బ్లాక్ బస్టర్ లు తీశారు.2018 లో రిలీజ్ అయినా రస్టిక్ లవ్ స్టోరీ ‘RX 100 ‘ తో మొదటి సినిమా డైరెక్ట్ చేసిన అజయ్ భూపతి సరికొత్త జోనర్ ని ఎంచుకుని బ్లాక్ బస్టర్ సాధించారు.ఈ సినిమా లో నటించిన కార్తికేయ ,పాయల్ రాజపుత్ కి మంచి గుర్తింపు లభించింది.

RX100 సినిమా తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి భారీ స్థాయి లో తీసిన ‘మహా సముద్రం ‘ ప్లాప్ గా నిలిచింది,హీరోయిన్ పాయల్ రాజపుత్ కి కూడా ఆమె నటించిన ఏ సినిమా కూడా కమర్షియల్ గా హిట్ సాధించలేదు,ఒక్క హీరో కార్తికేయ మాత్రం కొంచెం మంచి పొజిషన్ లో ఉన్నారు ,సినిమా లు హిట్లు అవ్వకపోయినప్పటికీ విల్లన్ గా కూడా చేస్తూ బిజీ గా ఉన్నారు,అయితే ఇప్పుడు మరల ఇంకోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది,అయితే ఈ సినిమా లో ప్రధాన పాత్రా లో ‘పాయల్ రాజపుత్’ చేస్తుండగా ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసారు.’మంగళ వారం’ సినిమా తెలుగు ,తమిళ్ ,మలయాళం ,కన్నడ బాషా ల లో రిలీజ్ కానున్నది.

డైరెక్టర్ ‘అజయ్ భూపతి ‘ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎవరు టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా ని చేస్తున్నాము, పాయల్ క్యారెక్టర్ ఒక 10 ఇయర్స్ వరకు అందరి కి గుర్తు ఉండిపోయేలా ఉంటుంది.ఒక RX100 ,దసరా .రంగస్థలం లను మించిపోయే రస్టిక్ అండ్ ఎమోషనల్ సినిమా గా ఉంటుంది అన్నారు.

2041 views