అభివృద్ధి లో చండీగఢ్,పారిస్ వంటి ప్రముఖ ప్రదేశాలతో రుడా పోటీపడుతోంది

Posted by venditeravaartha, March 11, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజమహేంద్రవరం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ కార్యాలయం లో రుడా పరిధిలోని చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధి పై మీడియా ముందు రుడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన 8 నెలలు కాలం అవుతుంది గడిచిన 8 నెలల్లో రియల్ ఎస్టేట్ రంగం అన్నది సంపద సృష్టించడం అతిముఖ్యమైనది అని దీన్ని అందరూ కూడా గమనించడం జరిగింది అని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది గతం లో అనేక సంస్కరణలు చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్లి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పై మాకు స్ఫూర్తి నింపుతున్నారు. బిజినెస్ మీద ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి అని దాని మీద కొన్ని జీవో లు తీసుకురావడం జరిగింది అని ప్రజలకు ఎలా సులభతరం చేయాలనీ దానిమీద కృషి చేసున్నామని రియల్ ఎస్టేట్ మీద ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పారు. అంతే కాకుండా దానికి కావాల్సిన అనేక నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చాల వరుకు లైసెన్సు విష్యంలో కూడా సానుకూలం గా తీసుకుంటున్నాము.

దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి నెల రోజులు పడుతుంది అని దానికి అనుగుణం గా నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పారు అలాగే గతం లో గూడా లో చేసిన కార్యక్రమాలు కాకుండా రుడా వచ్చిన తరువాత ఇలాంటి పూర్తి స్థాయి ప్లానింగ్ చేయలేదు అని దానికి అనుగుణం గా రుడా ను ఎలా డెవెలప్మెంట్ చేయాలి అని దానిమీద రానున్న రోజుల్లో ప్రభుత్వం ముక్యమైన అభివృద్ధి ప్లాన్ తయారు చేస్తున్నామని రుడా డెవెలప్మెంట్ కోసం ప్రత్యేక మైన ప్లానింగ్ చేస్తున్నామని అన్నారు, రాజమహేంద్రవరం నుంచి బయటకు వెళ్లే రోడ్లు డ్రైన్ లు మరియు ప్రజలకి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించి దానికి అనుగుణం గా అభివృద్ధి ప్లానింగ్ తీసుకుంటున్నామని రానున్న 100 ఏళ్లకు కూడా అభివృద్ధి లో రాజీలేని నిర్ణయాలను తీసుకుంటున్నామని దానికి కొన్ని ప్రదేశాల మోడలింగ్ కోసం చండీగఢ్,పారిస్ వంటి ప్రముఖ ప్రదేశాలు ఎలాగా డెవలప్మెంట్ అయ్యాయో అదేవిధంగా ఆ సెక్టార్ కు అనుగుణంగా అభివృద్ధికి పనిచేస్తున్నామని అన్నారు.

రానున్న రోజుల్లో రాజమండ్రి చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలను 30 కిలోమీటర్లు వరుకు కేరళ రాష్ట్రంలోని ప్రకృతి అందాలకు తీసిపోని విధంగా ఉమ్మడి జిల్లాలోని గోదావరి నదీ సోయగాలు, అల్లూరి జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలు ఉన్నాయని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తో ఆర్కిటిక్, టూరిజం కన్సల్ టెం తో చర్చించడం జరిగింది అని తెలిపారు.

Tags :
39 views