ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం: రుడా ఛైర్మన్ బొడ్డు

Posted by venditeravaartha, October 31, 2025
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

రాజానగరం: ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం సుగమం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రుడా (రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి & రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు స్పష్టం చేశారు.

రాజానగరం క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకట రమణ చౌదరి గారు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగానే నియోజకవర్గంలో ప్రజలకు అనేక సమస్యలు తలెత్తాయని ఆయన విమర్శించారు. అందుకే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నియోజకవర్గాలలో ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ లక్ష్యం ప్రజా సమస్యల సత్వర పరిష్కారమేనని ఆయన ఉద్ఘాటించారు

Tags :
152 views