RRR:జపాన్ లో చరిత్ర సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ! 200 రోజులు ,100 కోట్ల పైన కలెక్షన్ లు !

Posted by venditeravaartha, May 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన రాజమౌళి తన తదుపరి చిత్రం అయినా ఆర్ ఆర్ ఆర్ తో ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ కి సైతం తన మార్క్ ని చూపించారు
నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు తో మరి కొన్ని దేశీయ ,విదేశీయ అవార్డు ల ను సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు మరో ఎపిక్ ఫీట్ ని అందుకుంది.మార్చ్ 25 ,2022 నా రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ ,ఓవర్సీస్ లో దాదాపు 1200 కోట్ల కి పైగా వసూళ్లు సాధించి
రికార్డు నెలకొల్పింది.అయితే ఆర్ ఆర్ ఆర్ కి జపాన్ లో వచ్చిన ఆదరణ చూసిన ఈ సినిమా టీం అక్కడ మూవీ ని రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసి ,అక్కడ భారీ స్థాయి లో ప్రమోషన్ ల ను చేసి అక్టోబర్ 21 ,2022 నా జపాన్ లో రిలీజ్ చేసారు.

ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు జపాన్ లో చరిత్ర సృష్టిస్తోంది. ఈ చిత్రం అక్కడ థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది ,దాదాపు గా 100 పైగా థియేటర్ ల లో 200 రోజలు పూర్తి చేసుకుని ఇండియన్ కరెన్సీ లో 100 కోట్ల పైన వసూళ్లు రాబట్టి చరిత్ర లో నిలిచిపోయే సినిమా గా ఉండబోతుంది.గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైనప్పటి నుండి జపనీస్ థియేటర్‌లలో నిరంతరాయంగా నడుస్తోంది.

రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ ఎపిక్ ఇప్పుడు 200 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది మరియు అక్కడ కొన్ని మిలియన్ డాలర్లను సంపాదించింది. 2 బిలియన్లకు దగ్గరగా – దాదాపు $14 మిలియన్ వసూలు చేసింది. RRR జపాన్ లోని 44 నగరాలు మరియు ప్రిఫెక్చర్‌లలో 209 స్క్రీన్‌లు మరియు 31 ఐమాక్స్ స్క్రీన్‌లలో విడుదలైంది, ఇప్పుడు జపాన్‌లో విడుదలైన అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది. RRR దాని 29వ వారం రన్ ముగింపులో 195 మిలియన్లను యెన్ వసూలు చేసింది. డిసెంబరులో, RRR జపాన్‌లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది, ఇది రెండు దశాబ్దాలుగా రికార్డ్‌ను కలిగి ఉన్న రజనీకాంత్ యొక్క ముత్తును అధిగమించింది.

2408 views