రామ్ గోపాల్ వర్మ తన సినీ జీవితాన్ని ‘రావుగారిల్లు’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’ చిత్రాలకి సహాయ నిర్దేశకునిగా మొదలు పెట్టారు. తెలుగు సినీ ప్రపంచంలో ‘శివ’ సినిమా ద్వారా తన ఉనికిని ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, శిక్షణ, సహాయ సహకారాలు లేకుండా, 28 ఏళ్ల వయసులో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడైన ‘అక్కినేని నాగార్జున’ ను చిత్ర నిర్మాణానికి ఒప్పించగలిగారు. ఆయన కథ చెప్పిన విధానం నచ్చి నాగార్జున స్వయంగా చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. శివ చిత్రం తెలుగు చిత్ర ప్రపంచంలో ఒక చెరగని ముద్రని వేసుకుంది.
తాను దర్శకత్వం వహించిన తరువాతి సినిమాలు ‘క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా ‘ ,’గాయం ‘ తెలుగు లో కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి , హిందీ లో తీసిన ‘రంగీలా’,’సత్య ‘,’సర్కార్ ‘ వంటి సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. తన కంటూ ఒక ట్రేడ్ మార్క్ ని ఏర్పరుచుకున్నారు, పూరి జగన్నాధ్ ,కృష్ణవంశీ,తేజ ,శివనాగేశ్వరరావు లాంటి వాళ్ళు వర్మ గారి దగ్గర శిష్య రికం చేసిన వారే.
గొప్ప గొప్ప క్లాసిక్ ఎపిక్ లాంటి సినిమా లు తీసిన రాంగోపాల్ వర్మ గారు , ఆ తర్వాత కాలం లో తన ట్రేడ్ మార్క్ ని ఆపేసి , బూతు సినిమా లు ,హార్రర్ ,పొలిటికల్ సినిమా లు తీసి విజయాలకు దూరమయ్యారు , దానికి తోడు వివాదాలకు ఎప్పుడు దగ్గర గా ఉంటారు. తాను ఫేమస్ అవ్వడానికి ఎంతకైనా దిగజారడానికి , అవతల వాళ్ళని ఎంతకైనా దిగజార్చడానికి సిద్ధం గా ఉంటారు. అలాంటివి ఇది వరకు చాలానే చూసాం .కానీ మరల అలాంటిదే రిపీట్ చేసారు వర్మ.
రాంగోపాల్ వర్మను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వర్సిటీలో నిర్వహించిన అకాడమిక్ ఎగ్జిబిషన్‌కి చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే ,అక్కడ ఆయన మహిళల గురించి చులకనగా మాట్లాడటమే కాకుండా ,విద్యార్ధులను తప్పు దోవ పట్టించే కామెంట్స్ చేయడం ఇప్పుడ పెద్ద దుమారం రేపుతోంది.సినీ, రాజకీయ, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించి వివాదాలు, విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి అలాంటి మాటలే మాట్లాడి న్యూస్ లో హెడ్ లైన్ గా మారారు. ఆయన చేసే వ్యాఖ్యలు, పోస్ట్ చేసే ట్వీట్‌లు ఎంత వైరల్‌గా మారుతాయో అందరికి తెలుసు. రీసెంట్‌గా ఆయన చేసిన వ్యాఖ్యలు అంతకుమించి వివాదాస్పదమవుతున్నాయి.
నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అకాడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆర్జీవీ బ్రతికి ఉండగానే లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ,చనిపోయిన తర్వాత స్వర్గం ఉంటుందో లేదో తెలియదు,అక్కడ రంభ, ఊర్విశి ఉంటారో లేదో తెలియదంటూ స్టూడెంట్స్‌కి ఉపదేశం చేయడం కొత్త కాంట్రవర్సీకి దారి తీసింది,అంతే కాదు తనను గెస్ట్‌గా పిలిచిన అద్యాపకులు, ప్రొఫెసర్లకు కనీస గౌరవం ఇవ్వకుండా ,కష్టపడకుండా, ఉపాధ్యాయుల మాటలు వినకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ఇష్టానుసారంగా జీవించాలంటూ స్టూడెంట్స్‌కి తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చారు రాంగోపాల్‌వర్మ.
యూనివర్సిటీ చదువు ముగిస్తే లైఫ్ గురించి, జీవిత ఆశయాలపై నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన డైరెక్టర్ ,అందుకు పూర్తిగా భిన్నంగా కామెంట్స్ చేశారు.
కష్టపడి చదివితే ఎప్పుడూ పైకి రారని,అందుకే ఇక్కడ ఉన్నంత వరకు తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి అంటూ స్టూడెంట్స్‌ని తప్పు దోవ పట్టించే విధంగా సలహాలు ఇచ్చారు ఆర్జీవీ.అంతే కాదు తాను సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన 37సంవత్సరాల తర్వాత ఆ పట్టా అందుకోవడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ తన ఇంజినీరింగ్ పట్టాను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు,యూనివర్శిటీలో కార్యక్రమానికి వెళ్లి విద్యార్థులకు ఇలాంటి మాటలు ఎవరైనా చెబుతారా అంటూ ఆర్జీవీని కౌంటర్ చేస్తున్నారు మేధావులు, యూనివర్సిటీ స్టూడెంట్స్, అధ్యాపకులు, ఉద్యోగులు.ఇలాంటివి చెప్పడానికేనా ఆయన్ని పిలిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
సమాజంలో ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే రాంగోపాల్‌వర్మ చివరకు యూనివర్సిటీ గౌరవప్రదంగా ఆహ్వానించిన కార్యక్రమంలో కూడా విమర్శనాత్మకమైన కామెంట్స్ చేయడం చర్చనీయాంశమయ్యాయి.గతంలో ఆడవాళ్ల గురించి, అమ్మాయిలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి దానిపై వచ్చిన కామెంట్స్‌ని ఎంజాయ్ చేసిన రాంగోపాల్‌వర్మ ,ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శల్ని కూడా అంతే లైట్‌గా తీసుకుంటున్నారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యావంతులైన ప్రొఫెసర్లతో, చదువుకోని నేను అంటూ సెటైర్ వేస్తూ ప్రొఫెసర్లు, వీసీతో దిగిన ఫోటోని కూడా ఆర్జీవీ ట్వీట్టర్‌లో షేర్ చేశారు. దీనిపై కూడా నెటిజన్లు, స్టూడెంట్స్ మండిపడుతున్నారు.