RENU DESAI:అఖీరా నా కొడుకు మీ అన్న కొడుకు కాదు ! ఫాన్స్ మీద ఫైర్ అయినా రేణు దేశాయ్

Posted by venditeravaartha, April 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ స‌తీమ‌ణి, న‌టి, ద‌ర్శ‌కురాలు అయిన రేణు దేశాయ్‌కి, ఆయ‌న ఫ్యాన్స్‌ గా చెప్పుకునే కొంత మంది కి మ‌ధ్య తెలియ‌ని గ్యాప్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయితే అది కేవలం ఒక వర్గం కి సంబంధించిన అభిమానులు మాత్రమే, ఒక్కోసారి అది అత్యుత్సాహ‌మో ఏమో కానీ ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో త‌మ మాట‌ల‌ను దాటేస్తుంటారు. దాంతో రేణు దేశాయ్ సైతం వారిపై సీరియ‌స్ అవుతుంటుంది. ఇప్పుడు అకీరానంద‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కార‌ణంగా ఆమెకు ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో మ‌ళ్లీ గొడ‌వైంది. అయితే గ‌తంలో కంటే భిన్నంగా రేణు దేశాయ్ ఈసారి ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టంతో అవి నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే.

ఈ నెల 8 న అకీరా నంద‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ అభిమాని ‘ మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది మాకు, మీరు ఇలా దాచి పెట్ట‌కండి,అప్పుడప్పుడు అయినా వీడియోలో అకీరా బాబుని చూపించండి’ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడో ప‌వ‌న్ హార్డ్ కోర్‌ ఫ్యాన్. అయితే అకీరాను పవన్ కొడుకు అనటం రేణుకి నచ్చలేదు, వెంటనే ఫైర్ అయ్యింది. ‘మీ అన్న కొడుకు? అకీనా నా అబ్బాయి. మీరు ఒక త‌ల్లికి పుట్ట‌లేదా? మీరు ఆయ‌న‌కు వీరాభిమానులు అని నేను అర్థం చేసుకుంటాను. ప‌ద్ధ‌తిగా మాట్లాడ‌టం నేర్చుకోండి. ఇలాంటి మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌టం పూర్తిగా మానేశాను. అయినా మీరు మీ హ‌ద్దుల‌ను దాటుతున్నారు’ అంటూ ఆమె ఘాటుగా మెసేజ్ పెట్టింది.

దానికి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ‘సాధార‌ణంగా మ‌న తెలుగు రాష్ట్రాల్లో, కల్చ‌ర్‌లో మీరు ఎవ‌రి అబ్బాయి అని ఎవ‌రినైనా అడిగితే తండ్రి పేరే చెబుతారు. మీరు కార‌ణం లేకుండా ఫ్యాన్స్ మీద ఫైర్ కాకండి’ అని అన్నారు. దానికి రేణు స్పందిస్తూ ‘మీరు స్త్రీ జాతిని అవ‌మానిస్తున్నారు. మ‌న సంస్కృతిలో భ‌గ‌వంతుడి కంటే గొప్ప స్థానాన్ని త‌ల్లికే ఇచ్చారు. కావాలంటే మీరు అమ్మ‌ను అడ‌గండి’ అన్నారు.

అకీరా బ‌ర్త్ డే రోజున నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వ‌చ్చి నెగెటివ్ కామెంట్స్ పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. 11 సంవ‌త్స‌రాల నుంచి నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఓ త‌ల్లిగా ఎప్పుడూ హ‌ర్ట్ అవుతున్నాను. అస‌లు మీకున్న స‌మ‌స్య ఏంట‌నేది నాకు బొత్తిగా అర్థం కావ‌టం లేదు’ అని రియాక్ట్ అయ్యారు రేణు దేశాయ్.జూనియర్ పవర్ స్టార్ కి 19 ఏళ్లు పూర్త‌య్యాయి. త‌ను సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

628 views