Redin Kingsley: ‘జైలర్’ మరియు ‘డాక్టర్’ చిత్రాల కమెడియన్ ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడా? త్వరలోనే పెళ్లి!

Posted by venditeravaartha, October 2, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈమధ్య కాలం లో తమిళ కమెడియన్స్ కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతున్నారు. ఒకప్పుడు మన టాలీవుడ్ లో లెజండరీ కమెడియన్స్ కుప్పలు తెప్పలుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయినవాళ్లు ఉన్నారు, కొంతమంది లెజెండ్స్ చనిపోయారు కూడా. ఇండస్ట్రీ లో దశాబ్దాలు తన హాస్యం తో కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం వంటి వారు కూడా సినిమాలు చెయ్యడం బాగా తగ్గించేశారు. మరో కమెడియన్ సునీల్ ఏమో కామెడీ పాత్రలకు దూరమై వివిధ రకాల పాత్రలను చేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్స్ కొరత గట్టిగానే ఉంది. అందుకే తమిళ కమెడియన్స్ కి ఇక్కడ మంచి ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు సంతానం కామెడీ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఆడియన్స్. ఆ తర్వాత ఆయన కూడా కామెడీ పాత్రలకు దూరమై హీరో పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. దాంతో యోగి బాబు ఒక రేంజ్ లో క్లిక్ అయిపోయాడు.

Tamil Top comedians

యోగిబాబు కాకుండా ఈమధ్య తమిళ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాల్లో రెడిన్ కింగ్ స్లే ( Redin Kingsley)అనే కమెడియన్ పండించే హాస్యానికి మన టాలీవుడ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చూసేందుకు పొట్టిగా కనిపించే ఇతగాడి ఎక్స్ ప్రెషన్స్ కి నవ్వు వచ్చేస్తాది. ముఖ్యంగా డాక్టర్ సినిమాలో ఇతను పండించిన హాస్యానికి పొట్ట చెక్కలు అవ్వక తప్పదు, ఆ రేంజ్ లో మనల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘జైలర్’ చిత్రం లో కూడా ఇతగాడి కామెడీ బాగా క్లిక్ అయ్యింది. 2018 వ సంవత్సరం లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కో..కో..కోకిల’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా రెడిన్ , ఆ తర్వాత నాలుగు సినిమాల్లో కమెడియన్ గా నటించే ఛాన్స్ దక్కింది . ఇక ఎప్పుడైతే ఈయనకి డాక్టర్ చిత్రం లో కమెడియన్ గా నటించే ఛాన్స్ దక్కిందో, అప్పటి నుండి ఆయన కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Redin Kingsley

డాక్టర్ చిత్రం తర్వాత ఇతను దాదాపుగా 20 సినిమాల్లో నటించాడు, గత ఏడాది ఈయన నుండి 12 సినిమాలు వచ్చాయి.ఈ ఏడాది అప్పుడే పది సినిమాలు ఈయన నుండి విడుదల అయ్యాయి. రెడిన్ తొలుత ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీ లో తన కెరీర్ ని ప్రారంభించాడు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం తరుపున ఎన్నో కార్యక్రమాలు చేసిన రెడిన్, సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ లోకి వచ్చాడు.అయితే ఇతని గురించి కోలీవుడ్ లో లేటెస్ట్ గా ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే ఈయన ఒక ప్రముఖ కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తో చాలా కాలం నుండి ప్రేమాయణం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతే కాదు ఈయన రీసెంట్ గా ఆ హీరోయిన్ తో కలిసి ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కనిపించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. దీనిపై క్లారిటీ ఆయన ఇవ్వాలి.

374 views