YSRCP: రెడ్డి సామజిక వర్గానికి దూరమైనా వైసీపీ..నెల్లూరు జిల్లాలో ఊహకందని ఫలితాలు!

Posted by venditeravaartha, May 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

CM Jagan: వైసీపీ పార్టీ ని జగన్ స్థాపించిన రోజు నుండి నేటి వరకు రెడ్డి సామజిక వర్గం ఆ పార్టీ కి వెన్నుముక లాగా నిలుస్తూ వచ్చింది. 2014 , 2019 ఎన్నికలలో రెడ్డి సామజిక వర్గం నుండి వైసీపీ కి 70 శాతం కి పైగా ఓటింగ్ జరిగింది. అంతలా ఆ సామజిక వర్గం లో నాటుకుపోయిన వైసీపీ పార్టీ ఇప్పుడు పూర్తిగా పట్టు కోల్పోయిందని రీసెంట్ గా ఒక సర్వే సంస్థ తేల్చి చెప్పింది. ముఖ్యంగా పల్నాడు, నెల్లూరు మరియు చిత్తూరు జిల్లాలలో 50 కి పైగా రెడ్డీలు కూటమికి అనుకూలంగా ఓటు వేసారట. వైసీపీ పార్టీ అనుకూల మీడియా కూడా దీనిపై ఒక కథనం ప్రచురించగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కారణంగా ఈసారి రెడ్డి సామజిక వర్గానికి సంబంధించిన వారు అత్యధికంగా టీడీపీ జనసేన కూటమికి గుద్దేశారని ఆ కథనం యొక్క సారాంశం. ఇక్కడ అర్థం కానీ విషయం ఏమిటంటే, సీఎం జగన్ ఆదేశం లేకుండా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. మిగతా పార్టీలలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంటుంది కానీ,వైసీపీ పార్టీ లో మాత్రం అది ఉండదు. సీఎం జగన్ కి 151 సీట్లు రావడానికి కారణం జగనే, అలాగే ఆయన జూన్ 4 వ తేదీన ఎదురుకోబోతున్న ఘోర పరాభవానికి కూడా కారణం ఆయనే. జగన్ ఇప్పటి నుండే తన మీడియా తో ఓటమి క్రెడిట్స్ ని సజ్జల మీద, అలాగే వైసీపీ స్థానిక ఎమ్మెల్యేల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇకపోతే చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటె కూటమి కి 10 స్థానాలు వస్తాయని, అలాగే నెల్లూరు లో పది స్థానాలకు గాను ఆరు స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని, లేటెస్ట్ గా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఇదే కనుక జరిగితే వైసీపీ కి 20 కంటే తక్కువ సీట్లు వచ్చే ప్రమాదం ఉంది. 2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా 70 కి పైగా స్థానాలు వచ్చాయంటే అందుకు కారణం నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలే. ఇప్పుడు ఆ ప్రాంతాలే వైసీపీ పతనం కి కారణం అవుతున్నాయని టాక్. చూడాలి మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో అనేది.

461 views