ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు హీట్ ఎక్కువ అయింది అని చెప్పొచ్చు,ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర తో ఉభయ గోదావరి జిల్లా ల లో తిరుగుతుంటే మరో పక్క టీడీపీ నుంచి నారా లోకేష్ యువగలం పేరిట పాదయాత్ర చేస్తున్నారు.ఇందులో వాస్తవం గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర సూపర్ సక్సెస్ అయింది అనే చెప్పాలి దానికి కారణం ఆయన ప్రభుత్వం లోని లోపాలను వారు చేయని అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ఆయన వ్యక్తిగత జీవితం మీద బురద జల్లే ప్రయత్నం వైసీపీ వారు చేయడం ఇక మొన్నటి వరకు ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పది ఏడ్చే వైసీపీ మంత్రులు ఒక్కరు కూడా బయటకి వచ్చి ఆయన అడిగిన ప్రశ్నల కి సమాధానం చెప్పకపోవడం తో వారాహి యాత్ర ఎంత సక్సెస్ అయిందో చెప్పొచ్చు.
అయితే 2019 ఎన్నికల లో జనసేన పార్టీ ని ఓడించిన ఆంధ్ర ప్రజలను వదిలి పెట్టకుండా వారికీ ఏ కష్టం వచ్చిన తాను ఉన్నాను అంటూ వారికోసం కోట్ల రూపాయలను తన సొంత డబ్బు ని పంచి పెట్టిన పవన్ కళ్యాణ్ గారి మీద కావాలనే వైసీపీ నాయకులు వారి మీడియా తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారు,వీటి అన్నిటికి సమాధానం చెప్పాలిసిన అవసరం లేని కారణం చేత జనసేన వర్గాలు కూడా ఏమి మాట్లాడలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర లో ప్రజల సమస్య ల మీద పోరాటం చేస్తుంటే ఆయన పెళ్లి ల గురించి తప్ప మరే విషయం గురించి ఈ వైసీపీ వాళ్లు మాట్లాడటం లేదు.సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం తో విసుగు చెందిన ఆయన ఈ మధ్య వారాహి యాత్ర లో జగన్ ,జగ్గు భాయ్ అంటూ పిలిచినా విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామా సచివాలయం ,వాలంటరీ వ్యవస్థ లను తీసుకుని వచ్చారు
సచివాలయం ల కోసం పరీక్ష పెట్టి సెలక్షన్ చేసిన వీరు వాలంటరీ ల ను మాత్రం వారికి సంబందించిన పార్టీ కార్యకర్తలకి మాత్రమే ఇచ్చాము అని వారి మంత్రులు ,ఎమ్మెల్యే లు చెప్పిన చాల వీడియోస్ ల ను చూసాము.అయితే అందులో కొంత మంది మంచిగానే పని చేస్తున్న చాల వరకు తప్పులు చేసే వాళ్ళని చూసాము,ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తన వారాహి యాత్ర లో ప్రస్తావించారు.గ్రామా వాలంటీర్ ల ద్వారా ప్రజల డేటా ని హైదరాబాద్ లో ఉన్న ఒక కంపెనీ కి ఇస్తున్నారు అని అక్కడ ఆ డేటా ని ఏ విధముగా వాడుతున్నారో కూడా మనకి తెలియదు అంటూ మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర లో వైసీపీ ప్రభుత్వం ఆయు పట్టు అయినా వాలంటీర్ ల మీద చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వాలంటీర్ ల చేత పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలను తగలబెట్టించారు ఆయన మీద కేసు ల ను కూడా నమోదు చేయించారు.ఇప్పటి వరకు ఆంధ్ర లో ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాలకు బయటికి రాని మహిళా కమిషన్ కూడా పవన్ గారికి నోటీసు లు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నల ని వదిలి ఆయన మీద కేసు లు పెట్టి అరెస్ట్ చేసే అంత దమ్ము ఈ వైసీపీ ప్రభుత్వం కి లేదు అని అంటున్నారు.ఒక వేళా అలా జరిగితే ఆంధ్ర ప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం తప్పక జరుగుతుంది అనడం లో సందేహం లేదు.