Raviteja:టాలీవుడ్ సీనియర్ హీరో ల లో అత్యధిక రెమ్యూనిరేషన్ అందుకుంటున్న రవితేజ !

Posted by venditeravaartha, May 11, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ లు వేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరో స్థాయి కి వచ్చిన హీరో ‘రవి తేజ’,గత కొంత కాలం నుంచి సరైన సక్సెస్ లేకుండా ఉన్న రవితేజ కి ధమాకా సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ,ఆ తర్వాత వెంటనే చిరంజీవి గారితో చేసిన వాల్తేర్ వీరయ్య సినిమా 200 కోట్ల లో చేరింది.ఇక ఆ తర్వాత చేసిన రావణాసుర సినిమా ప్లాప్ గా నిలిచింది.కానీ ఈ సినిమా వలన ప్రొడ్యూసర్స్ లు ఏమి నష్టపోలేదు.రాజా ది గ్రేట్ సినిమా వరకు 5 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వస్తున్న రవితేజ ఆ సినిమా తర్వాత తన రెమ్యూనిరేషన్ ని 10 కోట్ల వరకు పెంచారు.

ధమాకా సినిమా తో సోలో హీరో గా 100 కోట్ల క్లబ్ లో చేరిన రవితేజ ,వాల్తేర్ వీరయ్య సినిమా కోసం 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అని టాక్,మరి ఆ తర్వాత రిలీజ్ అయినా రావణాసుర కి తాను కూడా నిర్మాత కావడం తో సినిమా కలెక్షన్ లో షేర్ మాత్రమే తీసుకున్నారు.మరి తన తదుపరి చిత్రం కి తన రెమ్యూనిరేషన్ ని మరింత పెంచేశారు రవితేజ గారు.తన సినిమా బిజినెస్ లో 25 % కానీ లేకపోతే 20 కోట్ల రెమ్యూనిరేషన్ కానీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.తన సినిమా కి ప్లాప్ టాక్ వచ్చిన కూడా 10 నుంచి 20 కోట్ల వరకు కలెక్షన్ లు వస్తాయి.అందువలన ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యూనిరేషన్ విషయం లో పాజిటివ్ గానే ఉన్నారు అని తెలుస్తుంది.ప్రస్తుత సీనియర్ హీరో ల లో చిరంజీవి ,పవన్ కళ్యాణ్ తర్వాత అంత పెద్ద మొత్తం లో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో రవితేజ.

900 views