Raviteja-Anudeep: జాతిరత్నాలు డైరెక్టర్ తో రవితేజ..’వెంకీ’ రేంజ్ కామెడీ సినిమా రాబోతోందా?

Posted by venditeravaartha, May 14, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మాస్ మహారాజ్ రవితేజ(Ravi teja) గారి ప్రస్తుత కెరీర్ చూస్తే ఒక హిట్ వస్తే తర్వాత వరుసగా రెండు ప్లాప్ లు పడుతున్నాయి,కరోనా మొదటి వేవ్ తర్వాత రిలీజ్ అయినా ‘క్రాక్'(Crack) సినిమా సూపర్ హిట్ అయింది,ఆ వెంటనే రిలీజ్ అయినా ఖిలాడీ ,రామారావు ఆన్ డ్యూటీ సినిమా లు డిజాస్టర్ ల గా నిలిచాయి.గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయినా ధమాఖా(Dhamaka) మూవీ తో తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాడు.ధమాకా సినిమా రవి తేజ గారిని 100 కోట్ల క్లబ్ లోకి చేర్చింది ఈ సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య(Walter veeraiah) సినిమా ద్వారా 200 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయ్యారు రవితేజ.

ఏప్రిల్ 7 న రిలీజ్ అయినా రావణాసుర(Ravanasura) ద్వారా మరో డిజాస్టర్ ని అందుకున్నారు. కేవలం హీరో గానే కాకుండా రవితేజ టీం వర్క్స్ అని ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టి తన సినిమా ల కి కో ప్రొడ్యూస్ చేస్తున్నారు అందులో భాగంగా చేసిన ‘రామరావు ఆన్ డ్యూటీ ‘ ,రావణాసుర’ సినిమా లు ప్లాప్ లు అయ్యాయి.ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు సినిమా తో బిజీ గా ఉన్న రవితేజ గారు త్వరలో ఒక పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయనుట్లు సమాచారం.జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్(Anudeep) తో రవితేజ గారు ఫుల్ కామెడీ సినిమా చేయబోతున్నారు అని టాక్.

పిట్ట గోడ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయినా ‘అనుదీప్ కె వి ‘ ఆ సినిమా పెద్దగా ఎవరికీ తెలియాలేదు.కానీ 2021 లో రిలీజ్ అయినా తన రెండవ సినిమా ‘జాతిరత్నాలు’ తో మంచి పేరు వచ్చింది.ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తో అనుదీప్ కి తమిళ్ స్టార్ హీరో ‘శివ కార్తికేయన్'(Siva karthikeyan) తో ప్రిన్స్ సినిమా చేసే అవకాశం లభించింది. అయితే ప్రిన్స్(Prince) సినిమా టైం లోనే రవితేజ గారికి ఒక కంప్లీట్ కామెడీ స్టోరీ చెప్పారు అని అది రవితేజ గారికి కూడా బాగా నచ్చింది అని ఇప్పుడు చేస్తున్న సినిమా లు పూర్తి అవ్వగానే రవితేజ టీం వర్క్స్ బ్యానర్ లోనే సినిమా తీద్దాం అని మాట ఇచ్చారు అని తెలుస్తుంది.ప్రిన్స్ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయని అనుదీప్..రవితేజ గారి కోసమే కథ ని డెవలప్ చేసే పని లో ఉన్నారు అని సమాచారం.ఇదే కానీ జరిగితే వింటేజ్ రవితేజ కామెడీ ని మరల ఎంజాయ్ చేయోచ్చు.రవితేజ గారి వెంకీ ,దుబాయ్ శీను ,అనుదీప్ జాతిరత్నాలు లాగానే వీరి సినిమా ఉండబోతుంది అంటున్నారు.

481 views