Raviteja-Balakrishna: రవితేజ ,బాలకృష్ణ కాంబినేషన్ లో మిస్ అయినా ఆ డిజాస్టర్ సినిమా ఏంటో తెలుసా ?

Posted by venditeravaartha, June 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

నందమూరి బాలకృష్ణ తన తండ్రి నుంచి నటన వారసత్వాని తీసుకుని ఆ తర్వాత తనకంటూ ప్రత్యకమైన స్టైల్ ని ఏర్పరుచుకుని టాప్ స్టార్ గా ఎదిగారు,1974 లో తాతమ్మ కాల అనే సినిమా ద్వారా తెలుగు తెర కి పరిచయం అయినా బాలకృష్ణ(Balakrishna) ఆ తర్వాత 1984 లో సాహసమే జీవితం అనే సినిమా తో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.తాను సోలో హీరో గా ఎంట్రీ ఇచ్చిన తన 3 వ సినిమా మంగమ్మ గారి మనవడు తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టారు బాలకృష్ణ.ఇక రామారావు గారు రాజకీయాల లో బిజీగా ఉన్న సమయం లో నందమూరి ఫ్యామిలీ యొక్క లెగసీ ని బాలయ్య తన భుజాలమీద మోసాడు అనడం లో సందేహం ఏమి లేదు.

balaya

బాలయ్య తన సినిమా కెరీర్ లో ప్రైమ్ టైం గా చెప్పుకునే 1985 తో 2001 లో బ్లాక్ బస్టర్ లను అందించాడు.తన సమకాలీనులు అయినా చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున లతో పోటీగా తన సినిమా లను తెచ్చేవాడు బాలకృష్ణ.అదే సమయం లో తాను నిర్మాత గా మరి యువరత్న బ్యానర్ లో కోదండరామిరెడ్డి తో ఓకే సినిమా ని ప్లాన్ చేసారు.ఆ సినిమా లో ఒక మేజర్ రోల్ కోసం చాల మంది ట్రై చేసారు.అలా ట్రై చేసిన వారిలో ఒకరు మన మాస్ మహారాజ్ రవితేజ.
1990 లో రిలీజ్ అయినా కర్తవ్యం సినిమా లో చిన్న క్యారెక్టర్ తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి ఆ తర్వాత కొన్ని సైడ్ క్యారెక్టర్ లు చేసి 1999 లో నీకోసం మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.

nippuravva

తాను సినిమా లలో క్యారెక్టర్ ల కోసం వెతుకుతున్నా సమయం లోనే బాలకృష్ణ, విజయశాంతి
కలయిక లో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా నిప్పు రవ్వ(Nippu ravva) సినిమా ని చేసారు.అయితే ఇందులో ఒక మేజర్ రోల్ కోసం రవితేజ వెళ్లారు.ఆ క్యారెక్టర్ ని రాజా రవీంద్ర పరుచూరి బ్రదర్స్ వలన ఆ ఛాన్స్ తనకి దక్కింది.ఇక ఆ సినిమా బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ హిట్ అయినా బంగారు బుల్లోడు సినిమా తో పోటీ  లో డిజాస్టర్ గా నిలిచింది.ఇదే విషయాన్ని రవితేజ ,బాలకృష్ణ గార్లు ఆహాలో ప్రసారం అయినా బాలకృష్ణ గారి టాక్ షో లో చెప్పారు. ఇక ఇటీవల వీరి కలయిక లో భారీ మల్టీ స్టార్రర్ రానుంది అనే వార్తలు ఉన్నాయి.

balaya raviteja

909 views