Rashmika: నితిన్ తో గొడవకి కారణం చెప్పిన రష్మిక..

Posted by venditeravaartha, July 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రష్మిక తన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించారు,ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టి తో నిచ్చితార్ధం కూడా చేసుకున్న ఈమె తెలుగు లో చలో సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు,అయితే తనకి తెలుగు లో వస్తున్న ఆఫర్ లు ని దృష్టి లో ఉంచుకుని పూర్తిగా తెలుగు లో స్థిరపడిన రష్మిక రక్షిత్ శెట్టి తో తన నిచ్చితార్ధం ని కూడా కాన్సల్ చేసుకున్నారు.ఇక ఆ తర్వాత వరుస సినిమా ల తో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక 2021 లో రిలీజ్ అయినా పుష్ప సినిమా తో పాన్ ఇండియన్ హీరోయిన్ గా ఇండియన్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు.తనకి తెలుగు లో చలో వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు ,నితిన్ గార్ల తో చేసిన భీష్మ తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు రష్మిక మందాన.

bheesham

అ ఆ సినిమా తర్వాత సరైన హిట్ లేకుడ్మ వరుస గా ప్లాప్ ల తో ఉన్న నితిన్ కి భీష్మ సినిమా తో భారీ సక్సెస్ వచ్చింది.అయితే ఈ సినిమా తర్వాత నితిన్ ,రష్మిక ల స్నేహం ఎక్కువ గా అయింది అని రష్మిక తో నితిన్ ఔటింగ్ ల కి కూడా వెళ్తున్నారు అంటూ అప్పట్లో తెగ న్యూస్ లు హల్చల్ చేసాయి.కానీ వీటిని కొట్టి పారేసిన నితిన్ ,రష్మిక లు ఆ తర్వాత కలిసి ఎక్కడ కూడా కనిపించలేదు.అయితే రష్మిక కి ,నితిన్ కి తమ కెరీర్ లో బెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములు వీరి కాంబినేషన్ లో సినిమా ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

vnr trio

VNR ట్రియో అంటూ నితిన్ ,రష్మిక కలయిక లో ఇటీవలే మూవీ ని మెగా స్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే అయితే మూవీ స్టార్ట్ అయినా కొన్ని రోజుల తర్వాత రష్మిక కి హీరో నితిన్ కి మధ్య గొడవలు వచ్చాయి అని అందువలన ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం అనిమల్ ,పుష్ప 2 సినిమా ల తో బిజీ గా తాను డేట్ లు కుదరకపోవడం వలెనే సినిమా నుంచి తప్పుకున్నారు అని తెలుస్తుంది
రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడం తో ఆ ఛాన్స్ ని గోల్డెన్ హీరోయిన్ శ్రీ లీల కి దక్కినట్లు తెలుస్తుంది.రష్మిక కి అంటే ఎక్కువ సినిమా లు చేస్తున్న శ్రీ లీల కి డేట్స్ ఉన్నప్పుడు రష్మిక కి డేట్ ల సమస్య ఎలా అనేది చర్చినీయాంశం గా మారింది.

sree leela

1618 views