RASHMIKA- SRINIVAS:రష్మిక తో డేటింగ్ పై నోరు విప్పిన బెల్లంకొండ శ్రీనివాస్!

Posted by venditeravaartha, May 4, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి పెద్ద కుమారుడు అయినా బెల్లంకొండ శ్రీనివాస్ 2014 లో అల్లుడు శీను సినిమా తో తెలుగు సినీ పరిశ్రమ లోకి హీరో గా అడుగు పెట్టారు.అల్లుడు శీను కమర్షియల్ గా హిట్ అయినప్పటికీ రాక్షసుడు సినిమా వరకు తనకి సరైన హిట్ లభించలేదు.తన సినిమా లు తెలుగు లో కంటే హిందీ లోనే అత్యధికంగా ఆదరణ పొందాయి ఇప్పుడు ప్రభాస్ గారి బ్లాక్ బస్టర్ హిట్ అయినా ‘ఛత్రపతి’ సినిమా ని హిందీ లోకి రీమేక్ చేస్తున్నారు ,ఈ చిత్రానికి వి వి వినాయక్ డైరెక్టర్ కాగా పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మింస్తున్నారు.ఒక పక్క హిందీ ఛత్రపతి ప్రొమోషన్ ల లో బిజి గా ఉన్న ఈ హీరో ,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా నేషనల్ క్రష్ మీద మనసు పడ్డారు అనే వార్తలు ఈ మధ్య తెగ వైరల్ అయ్యాయి.

బాలీవుడ్ లో ఛత్రపతి సినిమా ప్రొమోషన్ ల లో భాగం గా అక్కడ కొన్ని ఈవెంట్ ల లో రష్మిక తో కలిసి వెళ్లిన శ్రీనివాస్ మీద సోషల్ మీడియా మంచి గా ఫోకస్ చేసింది,రష్మిక అప్పట్లో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ తో ప్రేమాయణం జరుపుతోంది అని బాగా వైరల్ అయింది,అయితే ఈ మధ్య విజయ్ తో దూరం గా ఉంటుంది రష్మిక బాలీవుడ్ లో బిజీ గా ఉన్నారు ఇదే సమయం లో శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఫోటో లు ,వీడియో లు చూసిన వారు అంతా వీరి మధ్య ప్రేమ ఉంది అని అన్ని మీడియా ల లో హల్చల్ అయింది.ఈ విష్యం మీద శ్రీనివాస్ ని అడిగిన మీడియా కి సమాధానం ఇస్తూ ‘రష్మిక’ తో నాకు మంచి స్నేహం ఉంది అది ఆంత వరకు మాత్రమే ఉంది ,లవ్ అండ్ ఎఫ్ఫైర్ అంటూ ఏమి లేదు,ఒకటి రెండు స్టేజి ల లమీద కలిసి కనిపిస్తే లవ్ అనుకుంటే పొరపాటే అని అని అన్నారు.

1883 views