Rapo-Boyapati: రామ్ ,బోయపాటి శీను ల కొత్త సినిమా టీజర్ రివ్యూ!

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram) ,బోయపాటి శీను(Boyapati seenu) కలయిక లో సినిమా అనగానే భారీ అంచనాలు మొదలు అయ్యాయి.అఖండ(Akhanda) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శీను డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం తో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి అని చెప్పాలి.అయితే ఇస్మార్ట్ శంకర్(Ismart shankar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ఆ తరువాత రిలీజ్ అయినా ‘రెడ్’,’ది వారియర్’ ఆశించిన స్థాయి లో ఆడలేదు.మరి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ కి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తోడు కావడం తో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ నుంచి రాబోతున్న మొదటి పాన్ ఇండియన్ మూవీ కూడా కావడం తో బోయపాటి రామ్ ని ఇలా చూపించబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది.అయితే వాటి అన్నిటిని పటాపంచలు చేస్తూ ఈ రోజు మే 15 న రామ్ బర్త్ డే సందర్బముగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు..మాస్ లుక్ లో దున్న పోతు తో ఉన్న రామ్ లుక్ కి అయన చెప్పిన డైలాగ్స్ కి మంచి స్పందన లభించింది.

నీ స్టేట్ దాటలేను అన్నావు దాటాను,గేట్ దాటలేను అన్నావు దాటాను ,నీ పవర్ దాటలేను అన్నావు దాటాను..ఇంకా ఏంది ఈ బొంగు లో లిమిట్స్ అంటూ పవర్ ఫుల్ గా సాగే మాటల తో స్టార్ట్ అయినా టీజర్ మాస్ ఫైట్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ల తో ఆకట్టుకుంది.శ్రీలీల కాలేజీ స్టూడెంట్ లా కనించనున్నది.తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో అఖండ ని గుర్తు చేస్తుంది.జీ స్టూడియోస్ ,శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ల నుంచి శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.బోయపాటి శీను మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారో లేదో చూడాలి.

పాజిటివ్ :రామ్ మాస్ లుక్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,డైలాగ్స్ ,ఫైట్స్.
నెగటివ్:నో కామెంట్స్.
రేటింగ్:5 / 5
చివరిగా ఇస్మార్ట్ శంకర్ తో అఖండ.

2019 views