RANGAMARTHANDA:రంగమార్తాండ ని కాపాడలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి

Posted by venditeravaartha, March 29, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి కొంత కాలం గ్యాప్ తర్వాత తన డైరెక్షన్ లో ,విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,రమ్య కృష్ణ ,హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ప్రధాన పాత్రల లో నటించిన ‘రంగమార్తాండ’ గత వారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది,రంగమార్తాండ సినిమా గొప్ప క్లాసిక్ అని చూసిన వారందరు పొగడతల తో ముంచెత్తారు, IMDB రేటింగ్ లో కూడా 9 .1 ఉన్న రంగమార్తాండ చివరగా ‘డిజాస్టర్’ గా నిలిచింది.

రంగమార్తాండ కథ అంత ‘రంగస్థల ‘ నటుడు అయినా ప్రకాష్ రాజ్ ,అయన స్నేహితుడు బ్రహ్మానందం గారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.రంగస్థల నటుడి జీవితం ఎలా ఉంటుంది ,వాళ్ళ కి వచ్చే సమస్యలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కొంటారు అనే వాటి మీద చాల ఎమోషనల్ గా చూపించారు,క్లైమాక్స్ లో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ ,ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం గారి మధ్య వచ్చే సంభాషణలు కన్నీళ్లు పెట్టించాయి.రిలీజ్ కి ముందు వేసిన ప్రీమియర్ షో లో సినిమా ప్రముఖులు అందరు కూడా రంగమార్తాండ సినిమా చూసి సినిమా అద్భుతంగా ఉంది అంటూ వీడియో బైట్ లు ,ట్విట్ లు వేశారు,సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా యూనిట్ అందరిని పొగుడుతూ ట్విట్ చేసారు ,వీడియో బైట్ ఇచ్చారు.ఇంటికి పిలిచి అందరిని సత్కరించారు.

2 .2 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తో రిలీజ్ అయినా ‘రంగమార్తాండ’ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అయితే సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి 2 .5 కోట్ల కలెక్ట్ చేయాల్సి ఉండగా దానిని అందుకోలేకపోయింది.మొదటి రోజు 1 .18 కోట్ల గ్రాస్ వచ్చినప్పటికీ తర్వాత కలెక్షన్ రాబట్టలేకపోయింది,టోటల్ గా 1 .79 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది.బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 71 లక్ష లు కావాలి ,అయితే రేపు నాని ‘దసరా’ రిలీజ్ ఉండటం తో రంగమార్తాండ కలెక్షన్స్ ఇక క్లోసింగ్ కి వచ్చినట్లే. ఇండస్ట్రీ ,రివ్యూ లు పాజిటివ్ గా ఉన్నపటికీ ‘రంగమార్తాండ’ ని ప్రేక్షకులు ఆదరించలేదు.కథ ,కథనాలు బాగున్నప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది.

729 views