RAMCHARAN:35 సంవత్సరాల నుంచి ఉన్న పోటీ కేవలం ఫాన్స్ మధ్య లోనే మా మధ్య కాదు !

Posted by venditeravaartha, March 20, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

‘ఆస్కార్‌’ పురస్కారం అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు, తన తండ్రి చిరంజీవితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. దేశానికి ఆస్కార్‌ అవార్డును తీసుకొచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ను అభినందిస్తూ చరణ్‌ను శాలువాతో సత్కరించారు. తదుపరి రామ్‌చరణ్‌ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ 2023 సెషన్‌లో పాల్గొన్నారు. ఆ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా, ఆస్కార్‌ తదితర అంశాలతోపాటు ఆసక్తికర విషయాలు చెప్పారు.

RRR కథ అనుకున్నప్పుడు రాజమౌళి తారక్‌ని, నన్ను ఎంచుకోవడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం. కథ కూడా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది కావడంతో మా ఇద్దరికి కరెక్ట్‌గా మ్యాచ్‌ అవుతుందని గమనించి మా ఇద్దరినీ సెలక్ట్‌ చేసుకున్నారు. రాజమౌళి గారు చేసిన మ్యాజిక్‌ ఇది.

తెలుగు సినీ చరిత్రలో ఇండస్ట్రీ నుంచి ఈ స్థాయికి వెళ్లిన సినిమా లేదు. నామినేషన్‌ వరకూ వెళ్లి ఉండొచ్చు కానీ ఈ స్థాయి క్రేజ్‌ వెళ్లింది మాత్రం ‘RRR’ సినిమానే. ‘నాటునాటు’ పాట అంతగా పాపులర్‌ అయింది అంటే దీని వెనుక ఎంతోమంది కష్టం ఉంది. హీరోలుగా చేసిన మా ఇద్దరికీ అయితే మా డైరెక్టర్‌ రాజమౌళి తియ్యటి నరకం చూపించాడు. అయితే తారక్ ,నేను ఏ మాత్రం తగ్గకుండా అంతే స్థాయి లో పని చేశాం. మా అందరి కష్టాల ఫలితమే ‘ఆస్కార్‌’ అవార్డు.

నందమూరి ఫ్యామిలీకి ,మెగా ఫ్యామిలీ కి సినిమాల పరంగా, ఫ్యాన్‌ పరంగా 35 ఏళ్ళుగా పోటీ నడుస్తోంది. కానీ మా ఇద్దరి మధ్య, వ్యక్తిగతంగా మా ఇద్దరి కుటుంబాల మధ్య అలాంటిది ఏమీ లేదు. రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేది కాదు. మేం కూడా అంత ఆసక్తి చూపించేవాళ్లం కాదేమో. రాజమౌళి కాబట్టే మా కెరీర్‌ను ఆయన మీద పెట్టేశాం. ఆయనంటే అంత నమ్మకం. 14 ఏళ్ల క్రితం ఆయన ‘మగధీర’తో నాకు బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌, తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చారు. అలానే తారక్ కెరీర్ లో 3 బ్లాక్ బస్టర్ లు ఇచ్చి ఉన్నారు , ఆయనచేసే పనిని ఎంత గౌరవిస్తారో నాకు బాగా తెలుసు.

ఇక మా ఇంట్లో విషయాలకి వస్తే మా నాన్న,బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ గారు అంటే నేను ఎంతగానో గౌరవిస్తాను, మా నాన్న నాకు ఎడమ కన్ను అయితే.. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ కుడి కన్నుతో సమానం. ఇద్దరు నాకు వేర్వేరు కాదు’’ అని తెలిపారు.నాగ బాబాయి అంటే కూడా అంతే విధంగా ఉంటాను ,నాగబాబాయి దగ్గర నాకు ఫ్రీడమ్ ఉంటుంది అని నాన్న ,కళ్యాణ్ బాబాయ్ దగ్గర క్రమశిక్షణ గా ఉంటాను అన్నారు, మా ఫ్యామిలీ లో నాన్న ,కళ్యాణ్ బాబాయ్ తర్వాత నేను ఎక్కువగా గౌరవించే వ్యక్తి ఒక్కరే! ఆయనే రాజమౌళి.

1048 views